ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ.. పేద కుటుంబాలకు పల్లవి ప్రశాంత్ సహాయం..

టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7. ఎన్నో వివాదాలు తో మొదలై వివాదాలతోనే ముగిసిన ఈ సీజ‌న్‌లో హౌస్ మొత్తం లో 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. చివరకు పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. షోలో అమర్‌ ధీప్ రన్నర‌ప్‌గా నిలిచాడు. ఇక హౌస్‌లో టాలీవుడ్ నటుడు శివాజీ పెద్దగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ ను ముందు నుంచే ఎంకరేజ్ చేస్తూ వచ్చిన శివాజీ.. రైతు బిడ్డ టైటిల్ విన్ అవ్వడానికి కూడా ఎంతో కృషి చేశార‌ని ప్ర‌శాంత్ విన్న‌ర్ అవ్వ‌డానికి ఆయనే కారణంమ‌ని సోషల్ మీడియాలో కామెంట్లు తెగ వినిపించాయి.

Pallavi Prashanth : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్.. వాళ్లకు లక్ష రూపాయల సాయం చేయడంతో - Bigg Boss 7 Fame Pallavi Prashanth Helps Poor Farmer Children Gajwel

అయితే టైటిల్ విన్నర్‌గా నిలిచిన ప్రశాంత్ రూ.35 లక్షల ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్లు సొంతం చేసుకున్నాడు. హౌస్‌లో ప్రశాంత్ అడుగు పెట్టిన త‌ర్వాత విన్నరై ప్రైజ్ మనీ గెలిస్తే ఆ డబ్బును ఏం చేస్తావు అని నాగార్జున ప్రశ్నించగా.. పేద రైతులకు పంచి పెడతానంటూ సమాధానం ఇచ్చాడు. అలాగే హౌస్ లో ప్రశాంత్ గెలిచిన రూ.35 లక్షల రైతులకు పంచి పెడతానని షో ముగిసిన తర్వాత కూడా మరోసారి వివ‌రించాడు. అయితే షో ముగిసి మూడు నెలలు పూర్తయినా.. ఇప్పటివరకు ఎటువంటి హెల్ప్ ఎవరికి చేయకపోవడంతో మాట తప్పాడని.. ఇంకెప్పుడు సహాయం చేస్తాడని.. నెటింట విమర్శలు మొదలయ్యాయి. ఈ పుకార్లకు చెక్ పెట్టేందుకు ప్రశాంత్ తాజాగా రంగంలోకి దిగాడు.

Pallavi Prashanth : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్.. వాళ్లకు లక్ష రూపాయల సాయం చేయడంతో - Bigg Boss 7 Fame Pallavi Prashanth Helps Poor Farmer Children Gajwel

ఓ పేద రైతు కుటుంబానికి డబ్బు సహాయం చేసి అండగా నిలిచాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని గల కొలగూరు గ్రామానికి చెందిన ఓ పేద‌ రైతు కుటుంబానికి ప్రశాంత్ ఏకంగా లక్ష రూపాయల సహాయం అందించాడు. ఓ పేద రైతు, అతని భార్య చనిపోవడంతో పిల్లలు అనాధలు అయిపోయారు. వారి పిల్లల పేరున‌ ప్రశాంత్ ఈ డ‌బ్బు ఫిక్స్డ్‌ డిపాజిట్ చేయించి ఏడాదికి సరిపడా బియ్యాన్ని కూడా వారికి అందజేశాడు. అయితే ప్రశాంత్‌తో పాటే షోలో మరో కంటెంట్ గా వ్యవహరించిన ఆట సందీప్ కూడా తన రూ.25 వేలను ఆ పిల్లలకు సహాయం చేశాడు. మిగతా మనీని కూడా ఇలాగే పేద ప్రజలకు సహాయం చేసేందుకే పంచుతానని. సహాయం చేసిన ప్రతి ఒక్క ఫోటో, వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మీకు క్లియర్ క్లారిటీ ఇస్తానంటూ ఇన్స్టా వేదికగా వివరించాడు ప్రశాంత్. ప్రస్తుతం ప్రశాంత్ చేసిన ఈ పోస్ట్ నెటింట‌ తెగ చెక్కర్లు కొడుతుంది.