తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డేనే..

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్.. చివరిగా రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ళు కొల్లగొట్టిన ఈ సినిమా భారీ సక్సెస్ను సాధించడమే కాదు.. ఎన్టీఆర్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించే ప్రతి సినిమా అదే రేంజ్‌లో ఉండాలని భావిస్తున్నాడు. ఈ కారణంగానే ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ – కొరటాల శివ డైరెక్షన్‌లో దేవరలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు. అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీత అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్ మెల్లగా మొదలుపెట్టే పనిలో బిజీ అవుతున్నారట మేకర్స్.

Anirudh and Koratala @ NTR's house @ 2 AM - TeluguBulletin.com

ఈ మూవీ నుండి మొదటి సింగిల్ ను మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యార‌ట‌. అసలు విషయం ఏంటంటే మే 21న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ మూవీలోని మొదటి సింగిల్ ను అదే రోజున రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొద్ది రోజుల్లో రానందట. ప్రస్తుతం ఈ వార్త‌ వైరల్ అవ్వడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించడంతో ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్స్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.