ఓ మై గాడ్..షట్..కధ అడ్డం తిరిగిందే.. ఆ విషయంలో పప్పులో కాళ్లు వేసిన సమంత..!!

సమంత పప్పులో కాలు వేసిందా..? అంటే అవునని అంటుంది ఫిలిం ఇండస్ట్రీ . ఇన్నాళ్లు సమంత ఓ మాయ ప్రపంచంలో బ్రతికింది అని.. ఇప్పుడు ఆమె కథ అడ్డం తిరిగింది అని అసలు నిజానిజాలు తెలుసుకుంది అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈ మధ్యకాలంలో సినిమాలకు సైన్ చేయడమే మానేసింది . కొంతమంది మయోసైటిస్ వ్యాధి కారణంగా ఆమె సైన్ చేయలేదు అని చెప్పుకొస్తుంటే ..

మరి కొంతమంది సమంతకి ఉన్న హెడ్ వెయిట్ కారణంగానే వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు . నిజానికి సమంతా విడాకులు తీసుకున్న తర్వాత ఆమె వద్దకు భారీ భారీ సినిమా ఆఫర్లు వచ్చాయట . పాన్ ఇండియా స్థాయిలో ఆమె కెరియర్ ని మలుపు తిప్పే సినిమాలు కూడా వచ్చాయట . కానీ హీరోయిన్ సమంత ఆ సినిమాలను రిజెక్ట్ చేసిందట .

“నేనే తోపు .. నేనే కత్తి .. నేనే తురుము అనుకునే సమంత.. నేను లేకపోతే ఇండస్ట్రీ బ్రతకలేదేమో ఆ స్టార్ హీరోల సినిమాలు హిట్అవ్వవు అని ప్రూవ్ చేయడానికి ఇలా చేసిందట”. అయితే సమంత అనుకున్నది ఒకటి రియాలిటీ ఒకటి .. సమంతా లేకపోయినా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఆమె ప్లేస్ ను రీప్లేస్ చేయగలరు అని ప్రూవ్ చేశారు. దీంతో సమంత తీసుకున్న నిర్ణయం ఆమెకే బ్యాక్ ఫైర్ అయ్యింది అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు..!!