నేను సమాజం గురించి ఆలోచిస్తే త్రివిక్రమ్ నా గురించి ఆలోచించాడు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జల్సా అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఈ మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ లో అందుకోగా.. అజ్ఞాతవాసి మాత్రమే డిజాస్టర్‌ను మూట గ‌ట్టుకుంది. అయితే జల్సా సినిమా నుంచే వీరిద్దరి మధ్యన క్లోజ్ బాండింగ్ ఏర్పడింది. ఇద్దరి ఆలోచన కోణాలు ఒకే విధంగా ఉండడం.. ఇద్దరు బుక్ లవర్స్ కావడంతో వీరిద్దరి ఫ్రెండ్షిప్ మొదలైందట‌. గతంలో వీరిద్దరూ ఎంతో ఫ్రెండ్లీగా కనిపించినా పిక్స్ కూడా నెట్టింట తెగ చెక్క‌ర్లు కొట్టాయి.

ఆ పిక్స్‌ చూసిన ఎవరికైనా వీరిద్దరి మధ్యన ఎంత బాండింగ్ ఉందో ఇట్టే అర్థమవుతుంది. అయితే తాజాగా మరోసారి త్రివిక్రమ్ స్నేహం ఎలా ఉండేదో అనేదానిపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నేను సమాజం గురించి ఆలోచిస్తుంటే త్రివిక్రమ్ నా గురించి ఆలోచించేవాడు. నా దగ్గర ఉన్న డబ్బులు అంత‌ జనాలకు ఇస్తుంటే ఆయన నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండేలా సినిమాలు తెచ్చి పెట్టే ప్రయత్నాలు చేసేవాడు.. అసలు త్రివిక్రమ్‌కు నేను పాలిటిక్స్‌లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేద‌ని చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan and Trivikram to team up for their fourth film? | Telugu Movie  News - Times of India

చెప్పి చెప్పి విసిగిపోయిన త్రివిక్రమ్ ఎలాగైనా నన్ను మార్చాలని జల్సా సినిమాలో కొన్ని డైలాగ్స్ ఇచ్చాడని కానీ.. నేను అప్ప‌టినుంచి మ‌రింత రెచ్చిపోయి పాలిటిక్స్‌లో ఇన్వాల్వ్ అయిన‌ట్లు వివ‌రించారు. త్రివిక్ర‌మ్ ఇచ్చిన ఆ డైలాగ్స్‌తో నాకు సమాజం పైన గౌరవం మరింతగా పెరిగింది అంటూ వివరించాడు. నా బాగోగులు ఆలోచించే త్రివిక్రమ్ లాంటి ఫ్రెండ్ నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్న అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం త్రివిక్రంపై పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో వీరిద్దరి ఫ్రెండ్ షిప్ ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ప్రెండ్ అంద‌రికి ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.