వ్యాయామంతో పని లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!

ప్రస్తుత‌ జీవన శైలిలో ఆడా, మగా అనే తేడా లేకుండా ఎంతోమంది హై కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య కారణంగా శరీర ఆకృతి పూర్తిగా మారిపోవడం.. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ లాంటి ఎన్నో ప్రమాదకర వ్యాధుల బారిన పడడం చూస్తూనే ఉన్నాం. అలాంటివారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ని రోజు పాటిస్తే ఎక్సర్‌సైజ్‌లు ఏవి చేయకపోయినా ఈజీగా బరువు తగ్గవచ్చు. హై కొల‌స్ట్రాల్‌ సమస్య ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాలంటే తమ బాడీని ఎల్లప్పుడూ డిహైడ్రేట్ గా ఉంచుకోవాలి. ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని తప్పక తీసుకోవాలి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు చక్కర్లకు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ ఫుడ్లను తినే అలవాటు మానుకోవడం మంచిది.

ఇక రోజు ఏదో ఒక డీటేక్స్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల కూడా వ్యాయామం చేయకుండా సులభంగా బరువును తగ్గవచ్చు. ఇది శరీరంలోని టాక్సీన్‌లను తొలగించి.. కొలెస్ట్రాల్ కరగడానికి సహకరిస్తుంది. అలాగే మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. అధిక బరువుకు ఒత్తిడి కూడా కారణం కావచ్చు. అయితే ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి విటమిన్ సి బాగా పనిచేస్తుంది. సిట్రిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని డైట్లో చేర్చుకోవడం వల్ల స్ట్రెస్ దూరమవుతుంది. పైగా విటమిన్ సి జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది.

ఇక ఎక్సర్సైజ్ చేయకుండా బరువు తగ్గాలనుకుంటే ప్రోటీన్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాన్ని రోజువారి డైట్ లో చేర్చుకోండి. వెయిట్ లాస్ లో ప్రోటీన్ కీలక పాత్ర వహిస్తోంది. ఇక ప్రోటీన్ ఎక్కువగా దొరికే ఆహారాల్లో బీన్స్, ధాన్యాలు, గింజలు, సోయా లాంటివి ఉపయోగించవచ్చు. ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎక్కువ స‌మ‌యం పొట్ట నిండుగా ఉంటుంది. హుషారుగా పనిచేయగలుగుతారు. అలాగే చిరుతిళ్ళు, జంక్ ఫుడ్ లపై మనసు వెళ్లదు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు.