ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రజినీకాంత్ మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా రజినీకాంత్ ఎలాంటి క్రేజ్‌ సంపాదించుకున్నాడో అందరికీ తెలుసు. ఏడుపదులు వయసు దాటిన ఇప్పటికీ పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఇస్తున్నాడు రజనీకాంత్. ఆయన డిఫ‌రెంట్ స్టైల్ తో యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఆయన రెమ్యునరేషన్ కూడా కోట్లల్లో ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోల్లో రజినీకాంత్ కూడా ఒకరు. ఇక ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న రజినీకాంత్ తన మొదటి సినిమాలో నటించేటప్పుడు రెమ్యునరేషన్ ఎంత తీసుకుని ఉంటాడో అనే ఆసక్తి చాలామంది ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇంతకీ రజినీకాంత్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో.. ఒకసారి తెలుసుకుందాం.

రజనీకాంత్ మొదటిసారి 1975లో కమలహాసన్ హీరోగా నటించిన అపూర్వ రాగంగల్ సినిమాతో మొద‌టిసారి ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. బాలచందర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రజనీకాంత్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు గాను రజనీకాంత్ కు రూ.2 వేల‌ రెమ్యునరేషన్ ఇచ్చారట. ఈ విషయం ఇందులో హీరోయిన్గా నటించిన దివంగత అతిలోక సుంద‌రి.. శ్రీదేవి పలు సందర్భాల్లో వివరించింది. రజనీకాంత్, కమల్‌హాసన్, శ్రీదేవి కలిసి నటించిన ముండ్రు ముడిచ్చు సినిమా 1976 లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు కూడా బాలచంద్ర డైరెక్షన్ వహించాడు. ఈ సినిమాలో శ్రీదేవికి రూ.5వేలు.. రజినీకాంత్ కు అంతకంటే తక్కువ రూ.2 వేలు మాత్రమే పారితోషికాన్ని ఇచ్చారట.

అయితే హీరో కమల్ హాసన్ కు మాత్రం అప్పట్లోనే రూ.30 వేల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. కాగా ఈ మూవీ షూటింగ్ టైంలో శ్రీదేవి తల్లితో ర‌జినీ బాగా సన్నిహితంగా ఉండేవాడట. కమలహాసన్ లాగే నేను ఎప్పుడు స్టార్ట్ అవుతాను.. నా దగ్గర అంత టాలెంట్ ఉందా.. అని పదేపదే ఆమెను ప్రశ్నించేవాడట. శ్రీదేవి తల్లి కూడా దానికి స్పందిస్తూ తప్పకుండా నువ్వు పెద్ద నటుడు అవుతావు అని చెప్పేవార‌ట‌. ఇక ప్రస్తుతం ఆస్తులు, సినిమాల‌ విషయంలో రజనీకాంత్ కమల్ హాసన్ ని మించిపోయాడు. ఇద్దరు తమిళ్ స్టార్ హీరోలుగా దూసుకుపోతూ ఒకరితో ఒకరు గట్టి పోటీ ఇస్తున్నా ఇద్దరు ఒకేసారి స్టార్ నట్లుగా మారినా.. వృత్తిపరంగా ఎటువంటి భేదాలు లేకుండా మంచి ఫ్రెండ్స్‌లా ఉంటారు.