“ఆ ముగ్గురు లేకపోతే నాకు లైఫే లేదు”.. మహేశ్ బాబు ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అసలు ఫీలింగ్స్ ఉండవు అన్న ఫీలింగ్ అందరిలోనూ ఉంటుంది. మరి ముఖ్యంగా స్టార్ హీరోలు అంత ఈజీగా ఎమోషనల్ అవ్వరు అని ..వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు అని జనాలు అనుకుంటూ ఉంటారు . అయితే అది తప్పు అని ప్రూవ్ చేస్తున్నారు కొంతమంది హీరోలు . ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఎలా ఓపెన్ గా తమ ఫ్యామిలీ విషయాల గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారో మనం చూస్తున్నాం .

మరి కొందరు భార్య కూతురు తల్లి పై ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తమలోని ఎమోషనల్ ఫీలింగ్స్ ను బయటపడుతున్నారు . రీసెంట్ గా సోషల్ మీడియాలో మహేష్ బాబు షేర్ చేసిన ఒక ఫోటో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

 

రీసెంట్గా ఉమెన్స్ డే సందర్భంగా మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన లైఫ్ లో ఆ ముగ్గురే ఇంపార్టెంట్ అని వాళ్ళు లేకపోతే అసలు జీవితమే లేదు అంటూ చెప్పుకొచ్చారు . “తన తల్లి తన భార్య తన కూతురు ఫొటోస్ ని షేర్ చేశారు “. “నా జీవితంలోకి ప్రేమను ధైర్యం సంతోషం తీసుకొచ్చింది మీ ముగ్గురే ..హ్యాపీ ఉమెన్స్ డే అంటూ రాసుకు వచ్చాడు”. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ గా మారింది..!!