ఓ మై గాడ్.. నేను నమ్మలేకపోతున్నా.. దీని కోసమే నేను ఎదురు చూస్తున్న.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ టాప్ యాక్టర్ల జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమారన్‌ కూడా ఒకరు. గ‌తేడాది స‌లార్ పార్ట్ 1 లో వరదరాజ మన్నార్‌గా స్టన్నింగ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ ది గోట్‌ లైఫ్. వాస్తవ సంఘటనల ఆధారంగా బెన్యామిన్ రాసిన.. ఆడుజీవితం నవల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ మేకర్స్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు.

ఎప్పటిలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ మూవీలో తన క్యారెక్ట‌ర్లో జీవించేశాడు. కాగా సలార్ మూవీలో తన కోస్టార్ గా నటించిన పాన్ ఇంండియ‌న్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. నా బ్రదర్ పృథ్వీరాజ్ నువ్వు చేసిన పాత్రను చూస్తే వరదరాజమన్నారు.. నటించిన వ్యక్తి ఇలా చేశాడా అని ఆశ్చర్యపోయాను. దీనిని నేనే నమ్మలేకపోతున్నాను.. పృథ్వీరాజ్ గారికి నా అభినందనలు.. ఆల్ ది బెస్ట్ అంటూ వివ‌రించాడు. అమితమైన ప్రేమతో ది గోట్ లైఫ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా బ్లాక్ బాస్టర్ లోడింగ్ అంటూ ఇన్‌స్టా వేదిక‌గా ప్రభాస్ ఓ స్టోరీ పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ నెటింట‌ వైరల్ అవ్వడంతో ది గోట్ లైఫ్ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ ఆసక్తి నెలకొంది. రచయితగా, డైరెక్టర్ గా బ్లేసి వ్య‌వ‌హ‌రించ‌గా.. జిమ్మీ జీన్, లూయిస్, అమలాపాల్, రికబి ఇలా చాలామంది నటినట్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను విజువల్ రోమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెడ్ మీడియా ప్రొడక్షన్స్, అట్ల గ్లోబల్ మీడియా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మార్చి 28న గ్రాండ్ లెవెల్ లో ఏ సినిమాలో రిలీజ్ చేయనున్నారు.