చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా..?!

కాశ్మీరీ ట్రెడిషనల్ దుస్తులతో మెరుస్తున్న ఈ బూరి బుగ్గల అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా.. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్. టాలీవుడ్ టాప్ బ్యూటీ. దక్షిణాదిలో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి ఆకట్టుకుంది. అప్పట్లో యూత్ ఫేవరెట్ హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 80’s లో బిజీ హీరోయిన్గా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికి పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఒకప్పుడు సౌత్ టాప్ హీరోయిన్గా దూసుకుపోయిన ఈ అమ్మడు.. ఇప్పుడు తల్లి పాత్రలోనూ, అత్త పాత్రల్లోను అద్భుతంగా నటిస్తోంది.

ఇంతకీ ఆమె ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. సరే ఈ హింట్‌తో అయినా గెస్ చేయండి.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి జోడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో వీరిద్దరిదీ తిరుగులేని హిట్ కాంబో. వీళ్ళ‌ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి. అప్ప‌ట్లో ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇక చిరంజీవి ఈమె చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆమె ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.. స‌రే మేము చెపేస్తాంలేండి. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ రాధిక. తమిళ్ సినీ నటుడు, కమెడియన్ ఎమ్ఆర్ రాధా కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె నటించిన శ్రీలంక గీత లోనిదే ఈ ఫోటో.

రాధిక తన ఎడ్యూకేష‌న్ అంతా భారత్, శ్రీలంక, యూకేలో కంప్లీట్ చేసుకుంది. 1978 తమిళ సినిమా ఇష్కిష్కే పోవియ రైల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ మలయాళం హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికే 200 కు పైగా సినిమాల్లో కనిపించిన ఈమె.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, కమలహాసన్, విజయ్ కాంత్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. ఇక చిరు – రాధిక కాంబోలో అభిలాష, దొంగ మొగుడు, జ్వాలా, పట్నం వచ్చిన పతివ్రతలు, గూడచారి నంబర్ వన్, పులి బెబ్బులి ఇలా ఇంకా ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కయి.