” ఆడు పెద్ద వేస్ట్.. జాతకాల ముసుగు దొంగ “… వేణు స్వామిని ఘోరంగా ఏకేస్తున్న హీరోయిన్..!

ప్రముఖ జ్యోతిష్యుడు గా పేరు గాంచిన వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు కాకపోయినా నిత్యం సోషల్ మీడియాలో ఈయన గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. స్టార్ హీరో హీరోయిన్ల పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ నిత్యం ట్రోల్స్ కి గురవుతాడు వేణు స్వామి.

ఇక ఈయన మాటలని ప్రతి ఒక్కరూ నమ్మడంతో స్టార్ హీరోయిన్లు ఈయనతో ప్రత్యేక పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అలా పూజలు చేయించుకునే వారిని ఖండిస్తున్నారు కొందరు హీరోయిన్స్. తాజాగా తనకి జరిగిన ఓ ఇన్సిడెంట్ ను చెబుతూ వాపోయింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు కుషిత. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

ప్రస్తుతం బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ తో ఓ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె వేణు స్వామి పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ” నాకు ఫేమ్ రాకముందే ఇంకో సంవత్సరంలో నీకు ఫేమ్ వస్తుందని చెప్పానంటూ వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది పచ్చి అబద్ధం. నేను ఆయనని కలిసింది నాకు ఫేమ్ వచ్చిన తరువాతే. అలాంటిది నా గురించి ఆయన ముందే ఎలా చెప్తాడు. అలా చెప్పడం కరెక్ట్ కాదు ” అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.