తెలివైన దాని కాబ‌ట్టి సైబ‌ర్ క్రైమ్‌ను తిప్పికొట్టా.. బిగ్‌బాస్ శోభా శెట్టి ఇంట్ర‌స్టింగ్ పోస్ట్.. (వీడియో)

కార్తీకదీపం ఫేమ్ మౌనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్‌తో.. విలనిజం తో ప్రేక్షకులను భయపెట్టేసిన ఈ చిన్నది.. గతేడాది బిగ్‌బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో ఉన్న వాళ్లకు చుక్కలు చూపించింది. ఫైనల్ కు వెళ్లడానికి ఇంకో రెండు వారాలు ఉందనగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోయారు. అయితే ఈమె ఎప్పటినుంచో ఎలిమినేట్ అవుతుందని చాలామంది ప్రేక్షకులు భావించారు.. కానీ ఎప్పటికప్పుడు సేఫ్ అవుతూ రావడంతో బిగ్ బాస్ దత్తపుత్రి అంటూ శోభా శెట్టికి బిరుదు కూడా వచ్చేసింది. ఇక బయటకు వచ్చిన తరువాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం పలు పోస్టులు షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా అమ్మడు సైబర్ నెరగాళ్ల వల్లలో చిక్కుకోవద్దు అంటూ ఒక మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోను రిలీజ్ చేసింది.

ఆ వీడియోలో శోభా శెట్టికి ఒక కాల్‌ వచ్చినట్లు.. ఆమె మాట్లాడుతూ సైబర్ మోసం నుంచి తప్పించుకున్నట్లు చూపించింది. శోభా శెట్టికి సైబర్ నెరగాల నుంచి ఫోన్ వచ్చింది.. హాయ్ మేము ఫైబర్ నెట్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ బిల్ డ్యూ ఉంది. వెంటనే పే చేయకపోతే సర్వీసులు నిలిపివేస్తారు. మేము వెంటనే ఓ లింక్‌ పంపిస్తాము. అది క్లిక్ చేసి అమౌంట్ షేర్ చేయండి అంటూ ఆ వ్యక్తి చెప్తాడు. అయితే శోభాశెట్టి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. నేను కస్టమర్ కేర్‌కి కాల్ చేసి మాట్లాడి తెలుసుకుంటా అంటూ వివ‌రించింది. అవసరం లేదు మేము పంపే లింక్ తో సులభంగా డబ్బులు పంపించవచ్చు.. ఇది వెరీ ఈజీ ప్రాసెస్ మేడం అంటూ ఆ వ్యక్తి మాట్లాడుతాడు. అయితే శోభా శెట్టి కాస్త గట్టిగా మాట్లాడుతూ నేను కస్టమర్ కేర్ ఫోన్ చేసి మాట్లాడుతా.. నువ్వేం చేస్తున్నావో నాకు తెలియడం లేదనుకుంటున్నావా.. అని ఫైర్ అవుతుంది. వెంటనే ఫోన్ కట్ అవుతుంది.

Who is Shobha Shetty? Actress participates in Bigg Boss Telugu - The Statesman

అయితే ఇది స్క్రిప్టెడ్ అయినా మాక్సిమం రోజు వందల్లో ఇలాంటి సైబర్ మోసాలు జరుగుతున్నాయి. చాలా మందికి ఇవి తెలియక సైబర్ నేర‌గాళ్ళ‌ ఉచ్చులో పడి భారీ నష్టాన్ని చెవి చూడాల్సి వస్తుంది. ఇక శోభా ఈ వీడియో షేర్ చేసి తెలివిగా ఉండేందుకు ప్రయత్నించండి. నేను తెలివైన అమ్మాయిని కాబట్టే వారి నుంచి తప్పించుకున్నా. యూసీ, యూపీఐ మనకు తెలియని యాప్ లను ఎప్పుడు డౌన్లోడ్ చేయమని సజెస్ట్ చేయదు. ధ్రువీకరించమని లింకులను షేర్ చేయదు. దయచేసి అలాంటి లింక్స్ ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. కస్టమర్ సర్వీస్ లకు కాల్ చేసి కనుక్కునేందుకు ప్రయత్నించండి. అంతేకాదు అధికారిక ఛానల్ లో మాత్రమే మీ బిల్లులను చెల్లించండి. నకిలీ బిల్లు చెల్లింపులు, కాల్స్‌, ఎస్ఎంఎస్ లు వలలో పడకండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం శోభాశెట్టి చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Shobhashetty (@shobhashettyofficial)