వామ్మో..సాయి పల్లవి ఇలా ఊపేస్తుంది ఏంటీ..నైట్ పార్టీలో రెచ్చిపోయిన హైబ్రీడ్ పిల్ల(వీడియో)..!!

సాయి పల్లవి .. ఇండస్ట్రీలో ఈ పేరు కి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. పేరుకి మలయాళ బ్యూటీ నే కానీ చూసేందుకు మాత్రం అచ్చం తెలుగు ఇంటి అమ్మాయిల అనిపిస్తూ ఉంటుంది . ఈ బ్యూటీ తెలుగింటి కోడలు అవ్వాలి అంటూ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అయితే సాయి పల్లవి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అనేది చెప్పలేకపోతున్నారు .

రీసెంట్ గా సాయి పల్లవి జపాన్లోని నైట్ పార్టీలో తెగ ఎంజాయ్ చేసింది . అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది సాయి పల్లవి అన్న విషయం తెలిసిందే. వీళ్ళ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనుల్లో జపాన్లో బిజీ బిజీగా ఉంది . కాగా హీరోయిన్ సాయి పల్లవి జపాన్లో మూవీ టీం తో స్పెషల్ పార్టీలో పాల్గొంది. హైలైట్ ఏంటంటే ఈ పార్టీలో టీం మొత్తానికి ఒకే ఒక అమ్మాయి . ఇక ఈ పార్టీలో తన డాన్స్ తో అదరగొట్టేసింది .

షారుఖ్ ఖాన్ “చయ్య చయ్య” తనదైన స్టైల్ లో డాన్స్ వేసింది . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాయి పల్లవిలో ఇలాంటి టాలెంట్ ఉందా ..? ఇంత బాగా బాడీని బ్లెండ్ చేసేస్తుందా..? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు . మరికొందరు సాయిపల్లవి టూ స్పీడ్ రా బాబోయ్ అంటూ నాటి కామెంట్స్ చేస్తున్నారు.
సాయి పల్లవి కోలీవుడ్ – టాలీవుడ్ – బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . గార్గి సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి ఇప్పుడు తెలుగులో “తండేల్” అనే సినిమాలో కూడా నటిస్తుంది..!!