వాట్.. అమీషా పటేల్ కు ఎప్పుడో పెళ్లి జరిగిందా.. అతడే నా హస్బెండ్ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రీ, నాని లాంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ రెండు సినిమాలతో తెలుగులో భారీ పాపులాటి దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు మక్కాం మార్చేసింది. అక్కడ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అమీషా.. ఏవో కారణాలతో కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ అభిమానులకు టచ్ లో ఉంది.

ఇక ఇటీవల గాదర్ 2 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పటికీ అమీషాకు 48 ఏళ్లు అయినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదన్న‌ సంగతి తెలిసిందే. అయితే 50 ఏళ్ళ‌ వయసు పైబ‌డుతున్న యంగ్ హీరోలకు పోటీగా.. అంతే అందం, ఎనర్జీతో దూసుకుపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీషా పటేల్ మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని రివిల్ చేసింది. దీనితో అందరూ షాక్ అవుతున్నారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. అమీషా పటేల్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. నాకు నిజ జీవితంలో పెళ్లి కాకపోయినా ఓ వ్యక్తిని ఎప్పుడు భర్తగా ఊహించుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ అంటే నాకు చాలా ఇష్టం. అతని కోసమే నా లైఫ్ అంకితం అంటూ చెప్పుకొచ్చింది. నా మనసులో ఎప్పుడో టామ్‌ను భర్తగా అంగీకరించా అంటూ వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో ప్రేక్షకులంతా రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.