మన స్టార్ హీరోలకు అండగా తండ్రులు నటించిన సినిమాల లిస్ట్ ఇదే..

ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ తో ఓ హీరో ఎవరైనా ఎంట్రీ అంటే.. ఖ‌చ్చితంగా వారి అన్నయ్య లేదా తండ్రి లేదా ఆ ఫ్యామిలీ నుంచి ముందే ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్న సెలబ్రిటీస్ ఎవ‌రైనా అవ‌స‌రం అయిన‌ప్పుడు వారికి అండగా నిలబడుతూ ఉంటారు. అలా కొన్ని సార్లు మన స్టార్ హీరోల సినిమాలు సక్సెస్ అవడం కోసం ముందే స్టార్‌డమ్‌ సంపాదించుకున్న వారి తండ్రులు ఆ సినిమాల్లో నటించి మెప్పించారు. అలా కొడుకు సినిమా కోసం తండ్రులు నటించిన సినిమాల లిస్ట్ ఏంటో చూద్దాం.

సూపర్ స్టార్ కృష్ణ.. కొడుకు మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడు సినిమాలో రియల్ లైఫ్ లానే.. తండ్రి పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీంతోపాటు బి.గోపాల్ దర్శకత్వంలో మహేష్ చేసిన వంశీ సినిమాలో కూడా కృష్ణ ఓ పాత్రలో కనిపించాడు. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. ఇక మోహన్ బాబు కూడా త‌న‌ కొడుకులు నటించిన సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా మనోజ్ హీరోగా ఇంటర్ ఇచ్చిన శ్రీ సినిమాలో మోహన్ బాబు ఒక కీ రోల్‌లో నటించాడు. అయితే ఈ సినిమా మనోజ్ కు సక్సెస్ ఇవ్వలేదు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా రామ్ చరణ్ సెకండ్ మూవీ మగధీరలో బంగారు కోడి పెట్టే సాంగ్‌లో కొంచెం సేపు కనిపించి ఫ్యాన్స్‌ను మెప్పించాడు. ఈ సినిమాతో చ‌ర‌ణ్ ఇండస్ట్రియల్ హిట్ కొట్టి.. టాలీవుడ్ స్టార్ హీరోగా మారాడు. అలాగే అక్కినేని అఖిల్ మొదటి సినిమా అఖిల్.. మూవీలో నాగార్జున ఓ సాంగ్ లో కొంచెం సేపు డ్యాన్స్ చేస్తు క‌నిపించాడు. నాగార్జున కనిపించడంతో సినిమాకు బూస్టప్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందలేదు. అఖిల్ కు అప్పటి నుంచి ఇప్పటివరకు సరైన హిట్ ఒకటి పడలేదు.