‘ సీతారామం ‘ సీక్వెల్ ఉంటుంది.. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే..?!

హ‌నురాగపూడి డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెర‌కెక్కిన సూపర్ హిట్ మూవీ సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో రష్మిక మందన కీలక పాత్రలో మెప్పించింది. ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్ సంగతి అందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో మృణాల్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించడంతో మృణాల్‌కి వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. ఈ సినిమాలో సీతామహాలక్ష్మిగా, నూర్జహాన్ గా ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది మృణాల్.

మహానటి తరువాత వైజయంతి బ్యానర్స్ అదే రేంజ్ లో హిట్ అందుకున్న సినిమా సీతారామం కావడం విశేషం. ఈ సినిమాలో మ్యూజిక్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. క్లైమాక్స్ లో రామ్ కోసం ప్రిన్సెస్ నూర్జహాన్ (సీత) ఎదురుచూస్తూ ఉండడంతో కథ ముగ్గించారు. ఈ పాత్ర బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో ఆడియన్స్ సినిమా కొనసాగిస్తే బాగుంటుందని గతంలో సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేశారు. అయితే సీతారామం 2 పై హనూ రాఘవపూడి కూడా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా 2025 చివర్లో కానీ 2026 మొదట్లో కానీ సెట్స్ పైకి రానుంది.

ఈ గ్యాప్‌లో సీతారామం 2 సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే సీతా, రామ్‌ల కథ అక్కడితో పూర్తయిపోయిందట. ఆ పాత్రల మీద అడియ‌న్స్‌ చూపించే ఆశ‌క్తి కార‌ణంగా.. మరో కథతో వారి పాత్రలను భాగం చేసేలా ప్లాన్ చేస్తున్నరట. ఎలాగు సీతా, రామ్ క్యారెక్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కాబట్టి అవే క్యారెక్టర్లతో కొత్త కథలు చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడట హ‌ను రాఘవపూడి. కనుక సీతారామం సీక్వెల్ ఉంటే మాత్రం కచ్చితంగా ఈసారి దుల్కర్ సల్మాన్, మృణాల్‌ కలిసి మరోసారి నటిస్తారని తెలుస్తుంది. ఈ హిట్ పేయిర్ కలిసి నటిస్తే చూడాలని టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.