వామ్మో.. రకుల్ పెళ్లిలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వేసుకున్న డ్రెస్ అంత ఖరీదా.. కాస్ట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..

ఇటీవల స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్, జాకీ భ‌గ్నానీల పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట‌ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. ఈ వేడుకలు రకుల్, జాకీ భ‌గ్నానీల ఇరుకుటుంబ సబ్యుల తో పాటు వారి సన్నిహితులు కూడా హాజరయ్యారు. భారీగా బాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి చేశారు. ఇక ఈ వేడుకల్లో బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా హాజ‌రై సంద‌డి చేసింది. రాయల్ లుక్ లో ఫ్యాన్స్‌ను మ‌య‌మ‌రిపించింది. చివరిగా బాలయ్య‌తో న‌టించిన అఖండ తో హిట్ కొట్టిన ప్రగ్యా.. తర్వాత ఒకటి, రెండు సినిమాల్లో నటించిన ఆ సినిమాలు సక్సెస్ అందుకోలేకపోయాయి.

నెక్స్ట్ ప్రాజెక్టుపై ఇప్పటివరకు మరే అప్డేట్స్ కూడా రాలేదు. అయితే సినిమాల పరంగా ఈ బ్యూటీ కాస్త జోరు తగ్గించినా.. అభిమానులతో హాట్ ఫోటోలను, లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకోవడంలో మాత్రం తగ్గేదెలా అంటూ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా రకుల్ పెళ్ళిలో రాయల్ లుక్‌తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ డ్ర‌స్ కాస్ట్ ఎంతైఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

అయితే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కోసం అడ్రస్ తీసుకున్నట్లు ప్రగ్యా వివరించింది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా లేహంగా ధర కూడా అదే రేంజ్ లో ఉంది. కాస్ట్ తెలిస్తే ఖచ్చితంగా నోరెళ్ళ‌బెడతారు. ఇంతకీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారా అక్షరాల రూ.4 లక్షలని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కోసమే ప్రగ్య అంతలా ఖర్చు చేసి అలా స్పెషల్ డిజైనింగ్ చేయించుకుందట. కాస్త ధర ఎక్కువైనా ముత్యాలతో తయారుచేసిన లెహంగా సెట్లో ప్రగ్యా కూడా వజ్రంలా మెరిసిపోయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫొటోస్ నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు.