నాని ‘ సరిపోదా శనివారం ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన నాని.. గ్లింప్స్ (వీడియో)..

నేచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత‌ నాని నటిస్తున్న మూవీ సరిపోద్దా శనివారం. ప్ర‌స్తుతం నాని ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అంటే సుందరానికి ఫేమ్‌ వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. డివివి దాన‌య్య ప్రొడ్యూసర్‌గా గ‌తేడాది దసరా సందర్భంగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈరోజు నాని పుట్టినరోజు కావడంతో మూవీ టీమ్‌ సరిపోదా శనివారం గ్లింప్స్‌ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

కోపం ఏన్నో రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా కోపాన్ని బయట పెడుతుంటారు. కానీ కోపాన్ని ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎప్పుడైనా చూసారా.. నేను చూసా అంటూ నాని పాత్రని ఎస్.జే.సూర్యా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఇంట్రడ్యూస్ చేశాడు. నాని ఎంట్రీ తో అతని పేరు సూర్య.. రోజు శనివారం.. అంటూ గ్లింప్స్‌లో చూపించారు. ఇక ఈ మూవీ లో ఎస్‌.జే.సూర్యా పోలీస్ అధికారిగా విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

ఈ గ్లింప్స్ చూసిన నాని అభిమానులంతా.. అయితేనానికి శనివారం రోజు మాత్రమే సూపర్ పవర్స్ వస్తాయా? ఆ రోజు సూపర్ హీరోగా మారతాడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆగస్టు 29 రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. జోక్స్ బెజోయ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.