‘ సొంగా రోష‌న్‌ ‘ … డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌… 100 % కంప్లీట్ రివ‌ర్స్‌

ఎన్నారైలు రాజ‌కీయాల్లో రాణిస్తారా ? వారిలో చాలా మంది డ‌బ్బు సంపాదిస్తారు.. వారిలో కొంద‌రు సొంత దేశం.. లేదా స్వ‌గ్రామంపై మ‌మ‌కారంతో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తారు.. ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు.. ఎన్నారైలుగా ఉండి కొంద‌రు రాజ‌కీయాల్లోకి వ‌స్తారు.. అక్క‌డ వారి ఐడియాల‌జీకి ఇక్క‌డ గ్రౌండ్ లెవ‌ల్లో రాజ‌కీయాల‌కు సంబంధం ఉండ‌దు… చాలా మంది ఎన్నారైలు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా వారికి స్థానికంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న ఉండ‌దు.. దానిపై స‌రిగా మాట్లాడే స‌బ్జెక్ట్ కూడా తెలియ‌దు. ఇందుకు భిన్నంగా ఓ స‌రికొత్త ఐడియాల‌తో రాజ‌కీయం చేస్తూ త‌క్కువ టైంలోనే ఔరా అనిపిస్తున్నారు.. చింత‌ల‌పూడి టీడీపీ అభ్య‌ర్థి ఎన్నారై సొంగా రోష‌న్ కుమార్‌.

రోష‌న్ మాట్లాడుతున్న తీరుతోనే చాలా మంది ఫిదా అవుతున్నారు. 19 ఏళ్ల పాటు అమెరికాలో ఉన్నా తెలుగు భాష‌పై ఎంతో మ‌మ‌కారంతో పాటు మాట్లాడుతున్న విధానానికి నిజంగా హ్యాట్సాఫ్‌. మ‌న‌లోనే చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు స్టేజ్ మీద ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు.. ఏళ్ల‌కు ఏళ్ల అనుభ‌వం ఉన్నా తొట్రుపాటు ఉంటుంది. రోష‌న్‌కు ఇదే తొలి రాజ‌కీయం.. ఫ‌స్ట్ టైం ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. సాధార‌ణంగా ఎన్నారైలంటే కార్పొరేట్ రాజ‌కీయం చేస్తార‌నే అనుకుంటాం.. వారికి ఇక్క‌డ కేడ‌ర్‌, సీనియ‌ర్ లీడ‌ర్ల ప‌ట్ల రాజ‌కీయ అవ‌స‌రాలే త‌ప్పా ఇత‌ర రిలేష‌న్ ఉండ‌దు.

రోష‌న్ త‌న‌కు సీటు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గంలో నేత‌ల‌ను క‌లుస్తూ సీనియ‌ర్లు, పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్న నేత‌ల కాళ్ల‌కు సైతం న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకోవ‌డం ఆయ‌న‌లోని సున్నిత మ‌న‌స్త‌త్వాన్ని చెపుతోంది. జంగారెడ్డిగూడెంలో జ‌రిగిన ప‌రిచ‌య కార్య‌క్ర‌మంలో చిన్న‌పాటి అసంతృప్తులు ఉన్నా కూడా మీ కొడుకు లాంటి వాడిని త‌ప్పులుంట‌నే మ‌న్నించండి… ద‌య‌చేసి మ‌నంద‌రి ల‌క్ష్యం గెలుపు ఒక్క‌టే కావాలంటూ చేతులెత్తి.. త‌ల‌వంచుతూ న‌మ‌స్క‌రించారు.

19 ఏళ్లు అమెరికాలో ఉన్నా ఇన్‌చార్జ్ వ‌చ్చిన మ‌రుక్ష‌ణం నుంచే ప్రెస్‌మీట్ల‌లో ఏపీ స‌మ‌స్య‌లు, ఇబ్బందులు, స్థానిక‌, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై మంచి వాగ్దాటితో ఎక్క‌డా తొట్రుపాటు లేకుండా మాట్లాడుతుండ‌డం మ‌రో గొప్ప విష‌యం. జ‌గ‌న్ మోస‌పు రెడ్డితో మొద‌లు పెట్టి జ‌గ‌న్ ప్ర‌భుత్వం వాడుతోన్న కామెడీ మ‌ద్యం బ్రాండ్‌ల‌తో పాటు అమ‌రావ‌తికి జ‌రిగిన అన్యాయం, రాష్ట్రంలో అప్పుల లెక్క‌లు అన్నీ చాలా డీటైల్గా.. ఆక‌ట్టుకునేలా మాట్లాడుతున్నారు. ఈ లెక్క‌లు అన‌ర్గ‌ళంగా మాట్లాడుతుండ‌డం చూసి అమెరికాలో ఉన్నా ఇంత స్ప‌ష్టంగా ఎలా తెలుగు మాట్లాడుతున్నారు.. ఇంత డెప్త్ స‌బ్జెక్ట్ ఏంట‌ని ప్ర‌శ్నిస్తే… నేను తాగింది ఈ నీళ్లే.. పెరిగింది ఇక్క‌డ కాదా ? అని న‌వ్వుతూ చెప్పారు. రోష‌న్ స్వ‌గ్రామం లింగ‌పాలెం మండ‌లంలోని ధ‌ర్మాజీగూడెం అయినా ఆయ‌న పుట్టింది ఫాతిమాపురం… మ‌రో విశేషం కూడా ఉంది.. రోష‌న్ సుప్రీంపేట మ‌న‌వ‌డు.. వారి త‌ల్లి స్వ‌స్థ‌లం చింత‌ల‌పూడిలోని సుప్రీమ్‌పేట‌.

 

నియోజ‌క‌వర్గంలో ఏ ఊరు వెళ్లినా కూడా త‌న‌తో పాటు టిక్కెట్ ఆశించిన ప్ర‌తి ఒక్క‌రి పేరు ప్ర‌స్తావిస్తూ వారి స‌హాయ‌స‌హ‌కారాలు, స‌మ‌న్వ‌యంతోనే ముందుకు వెళ‌తాన‌ని చెపుతున్నారు. రోష‌న్‌తో పాటు సీటు ఆశించింది బొమ్మాజీ అనిల్‌కుమార్‌, ఆకుమ‌ర్తి రామారావు మాత్ర‌మే కాదు.. ఇత‌ర నేత‌ల‌ను ఆయ‌న గుర్తు చేసుకుంటున్నారు. అంత బ‌లంగా రేసులో లేక‌పోయినా ప‌గ‌డ‌పు సౌభాగ్య‌వ‌తి పేరు సైతం ప్ర‌స్తావించ‌డంమే కాదు.. జంగారెడ్డిగూడెం ప‌ర్య‌ట‌న రోజు స్వ‌యంగా ఆమె ఇంట్లోనే లంచ్ చేశారు. అలాగే అంబేద్క‌ర్‌, బొబ్బ‌ర రాజ్‌పాల్ పేర్ల‌ను సైతం ప్ర‌స్తావిస్తుండడం ఏ చిన్న నాయ‌కుడు, కార్య‌క‌ర్త‌ను కూడా తాను వ‌ద‌ల‌న‌ని చెప్ప‌క‌నే చెపుతున్నారు. ఏదేమైనా రోష‌న్ కుమార్ ఎన్నారైగా కాదు.. ప‌క్కా లోక‌ల్‌.. ప‌క్కా పొలిటిషీయ‌న్‌గా అంద‌రి అంచ‌నాల‌కు 100 % భిన్న‌మైన రాజ‌కీయంతో దూసుక‌పోతున్నార‌న్న‌ది వాస్త‌వం.

చంద్ర‌బాబుకు సోమ‌వారం పోల‌వ‌రం.. రోష‌న్‌కు జంగారెడ్డిగూడెం శుక్ర‌వారం :
గ‌త ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు ప్ర‌తి సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చుకుని పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేసే విష‌యంలో ఎంత ప్లానింగ్‌తో, చిత్త‌శుద్ధితో ప‌నిచేశారో ఇప్పుడు రోష‌న్ సైతం అధినాయ‌కుడి బాట‌లోనే వెళ‌తానంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన జంగారెడ్డిగూడెం ప‌ట్ట‌ణాన్ని త‌న‌దైన వ్యూలో అభివృద్ధి చేసేందుకు ప్ర‌తి శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌ట‌న‌ల‌తో పాటు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు విన‌డం, అర్జీలు స్వీక‌రించ‌డం.. వాటి ప‌రిష్కారంపై దృష్టి పెట్ట‌డం చేస్తాన‌ని చెప్పారు.