డ్రగ్స్ కేసులో ఇరుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. ఎఫ్ఐఆర్ నమోదు.. క్లారిటీ ఇదే..

టాలీవుడ్ లో డ్ర‌గ్స్ వివాదాలు ఎప్పటినుంచో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ళ‌ క్రితం డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులంతా పట్టు బ‌డ్డారు. ఇటీవల వారికి ఉపశమనం లభించింది. అయితే తాజాగా మరోసారి ప్రముఖ యూట్యూబర్ ష‌ణ్ముక్‌ పోలీసులకు డ్ర‌గ్స్‌తో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి టాలీవుడ్‌లో డ్రగ్స్ ఇష్యూ కలకలం రేపుతుంది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు ఈ కేసులో వినిపిస్తుంది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో పార్టీ జరుపుకుంటూ.. డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్ద‌రు అమ్మాయిలు.. ఆరుగురు పురుషులు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పలువురు రాజకీయ నేతల కుమారులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ బిజెపి నేత కుమారుడు, అలాగే బిజినెస్ మ్యాన్ కొడుకు కూడా ఇందులో ఉన్నారట.

ఇక రాడిసన్ హోటల్ లో పెద్ద మొత్తంలో కొకెయిన్‌ దొరికినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో ఓ మోడల్, టాలీవుడ్ ప్రొడ్యూసర్ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే ఈ కేసులో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కృష్ పేరు కూడా వినిపిస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదవ నిందితుడిగా కృష్ పేరు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ హోటల్ లో డ్రగ్స్ పట్టుబడిన సమయంలో.. జరిగే పార్టీలో డైరెక్టర్ క్రిష్ అరగంట పాటు ఉన్నట్లు పోలీసులు వివరించారు. హోటల్ యజమానితో కూడా కృష్ మాట్లాడినట్లు సమాచారం. అయితే ఎఫైర్ లో కృష్‌ పేరు నమోదు కావడంతో అయ‌న‌ పరారీలో ఉన్నాడంటూ ఇప్పటికే పలు వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ వ్యవహారంపై డైరెక్టర్ కృష్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ నేను రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట నిజం. అక్కడకు నా స్నేహితుడిని కలిసేందుకే వెళ్లాను అంటూ క్రిష్ చెప్పుకొచ్చాడు. తన డ్రైవర్ రావడం ఆలస్యం కావడంతో హోటల్ యజమాని వివేకానందతో కాసేపు మాట్లాడాన‌ని డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటూ క్రిష్ చెప్పుకొచ్చాడు. అంతేకానీ ఈ డ్రగ్స్ వివాదంలో నాకు ఎలాంటి సంబంధం లేదని తెల్చి చెప్పాడు. ఈ విష‌యాని పోలిసుల‌కు కూడా వివ‌రించాన‌ని చెప్పాడు. అయితే పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్‌ చేయడంతో క్రిష్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ కేస్ ముందు ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.