‘ ఫిదా ‘ తర్వాత సాయి పల్లవితో కలిసి నటించకపోవడానికి కారణం ఇదే.. మెగా ప్రిన్స్ సెన్సేషనల్ కామెంట్స్‌..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పల్లెటూరి నేప‌ద్యంలో తెలంగాణ యాసతో సాయి పల్లవి, అమెరిక అబ్బాయిలా వరుణ్ తేజ్ ఇద్ద‌రు త‌మ న‌ట‌న‌ట‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. సాయి పల్లవి అందం, అభినయం, డ్యాన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో వీరిద్దరూ తమనటులతో ప్రేక్షకులను మైమరిపించారు.

అయితే అప్పట్లో ఈ జోడి ప్రేక్షకులకు ఫేవరెట్ జంట‌గా నిలిచారు. కాగ‌ మళ్ళీ ఈ జంట‌ రిపీట్ అవుతే బాగుంటుందని ఎంతో మంది ఫ్యాన్స్ ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఇక‌ తాజాగా దీనిపై వరుణ్ తేజ్ స్పందించారు. ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్ లో భాగంగా సందడి చేసిన వరుణ్ తేజ్.. వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాక‌పోవడానికి కారణం ఇదేనంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. సాయి పల్లవి, నేను కలిసి మళ్ళీ నటించకపోవడానికి ఓ బలమైన కారణము ఉంది అంటూ వివరించాడు. మేము కలిసి సినిమా చేయాలని భావించం.. మా సినిమా కోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నాం.

దానికి త‌గ్గ‌టు డైరెక్టర్స్ కూడా మాకు కొన్ని కథలు చెప్పారు. ఇద్దరం కథలు విన్నాం. కానీ వాటిలో ఏ కథ‌ మాకు నచ్చలేదు. ఈసారి మేమిద్దరం కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా ఫిదాను మించి ఆ సినిమా స్టోరీ ఉండాలని భావించాం. లేదంటే ఇద్ద‌రం క‌లిసి సినిమానే చేయకూడదని ఫిక్స్ అయ్యాం. అయితే ఇప్పటివరకు అలాంటి స్టోరి మాకు దొరకలేదు. దీంతో ఇప్పటివరకు మేము కలిసి నటించే అవకాశం రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్ అవుతున్నాయి.