తారక్, పవన్, మహేష్ ముగ్గురుని స్టార్ హీరోలుగా మార్చిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారంతా స్టార్‌డం సంపాదించుకోవడానికి.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఇండస్ట్రీలో తాము ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే అలా ఎంతో కష్టపడి తమ స్టార్‌డంను ఇప్పటికీ కొనసాగిస్తున్న హీరోలలో తారక్, పవన్ ,మహేష్ మొదటి వరుసలో ఉంటారు. ఈ ముగ్గురికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోలు అవ్వడానికి ఆ హీరోయిన్ ప్ర‌ధాన కార‌ణం అంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ఆమె ఇచ్చిన సూపర్ సక్సెస్ లతోనే వీరు ముగ్గురు స్టార్ హీరోలుగా మారారు అంటూ తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం. ఆమె ఎవరో కాదు భూమిక. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాల్లో నటించి ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మొదటి పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించి స్టార్ హీరోగా మార్చింది. 2001లో వ‌చ్చిన‌ ఈ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి డైరెక్షన్లో వ‌చ్చిన‌ సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్ ని యూటర్న్ చేసింది. ఈ సినిమాలో కూడా భూమిక హీరోయిన్గా నటించింది. ఇక మహేష్ బాబు హీరోగా.. గుణ‌శేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఒకడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్గా నటించింది. ఇలా భూమిక హీరోయిన్గా నటించిన సినిమాలు వరుసగా సక్సెస్ కావడం ముగ్గురికి ఈ సినిమాలతోనే స్టార్ హీరోలుగా క్రేజ్ రావడంతో ఈటాలీవుడ్ స్టార్ హీరోల సూపర్ సక్సెస్‌కు భూమికనే కీలక పాత్ర పోషించిందంటూ.. ఆమె ఈ సినిమాలలో నటించడం వల్లే ఈ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.