ఇన్నేళ్ల కెరీర్ లో మొదటిసారి అలాంటి పనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి.. షాక్ లో ఫ్యాన్స్..

ఇటీవల మూవీరన్, అయాలన్‌ సినిమాలతో వరుస విజయల‌ను అందుకని సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు యంగ్‌ హీరో శివ కార్తికేయన్. ఇక శివ‌కార్తికేయ‌న్ హీరోగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా ప్ర‌స్తుతం అమరాన్ మూవీ రూపొందుతుంది. రాజ్ కుమార్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియ‌సామి దర్శకత్వం వహిస్తున్నాడు. జీవీ ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇందులో శివ కార్తికేయన్ బోర్డ‌ర్‌లో యుద్దం చేసే సైనికుడిగా కనిపించినున్నాడు. ఆయన సతీమణిగా సాయి పల్లవి కనిపించనుంది.

ఇక ఈ మూవీ షూటింగ్ అంతా కాశ్మీర్‌లో 3 నెలలుగా జరుగుతుంది. మరో 10 రోజులపాటు కాశ్మీర్ లోనే షూటింగ్ జరుగుతుందని సినీ వర్గాల సమాచారం. మిగిలిన షూటింగ్ చెనై ఏరియాల‌లోనే నిర్వహించే ప్రయత్నంలో ఉన్నారట మేకర్స్. ఇందులో ఓ రొమాంటిక్ సాంగ్‌లో సాయి పల్లవి నటించిన్నుందని తెలిస్తుంది. అయితే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా సాయి పల్లవి రొమాంటిక్ సాంగ్లో నటించిందేలేదు. ఇక శివ కార్తికేయన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మొదటిసారి సాయి పల్లవి రొమాంటిక్ సాంగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వార్తలు వైరల్ అవ్వడంతో అంతా షాక్ అవుతున్నారు.

అయితే కథ పరంగా ఈ సాంగ్ చాలా అవసరం కనుక సాయి పల్లవి ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం ఈ న్యూస్ వైర‌ల్‌ అవ్వడంతో సాయి పల్లవి ఎప్పటికీ కొన్ని బోర్డర్స్ దాటరు ఆ నమ్మకం మాకు ఉంది అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఆగస్టు నెలాక‌రుక‌లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్ భావిస్తున్నారట. ఇక శివ కార్తికేయన్ కూడా తన నెక్స్ట్ మూవీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాడు. ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్లో శివ కార్తికేయన్ నెక్స్ట్ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఈ రెండు సినిమాలే కాకుండా శివ కార్తికేయన్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.