‘ విశ్వంభర ‘లో ఎవరు ఊహించలేని గెటప్ లో మెగాస్టార్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసారాతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ వ‌శిష్టా.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు కథానాయక త్రిష కూడా సెట్స్ లోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక‌గా మెగాస్టార్ షేర్ చేసుకోవ‌డంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయింది.

అయితే ఇప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాలన్నిటితో పోలిస్తే ఈ మూవీ చాలా భిన్నంగా ఉండ‌న్నుంద‌ని ఈ సినిమాలో మెగాస్టార్ సరికొత్త రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. ముల్లోకాల బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందుతున్న‌ట్లు ఇప్ప‌టికే ప‌లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయట. అందులో మెగాస్టార్ 70 ఏళ్ల వృద్ధుడు పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. అయితే మరో వైవిధ్యమైన పాత్రకు మెగాస్టార్ తెరలేపుతున్నాడట.

ఈ పాత్ర ఎంతో కీలకంగా ఉండని తెలుస్తుంది. ఈ సినిమాను అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ వశిష్ట. ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న‌ట్లు సమాచారం. సోషియా ఫాంటసీ డ్రామా కావడంతో.. విఎఫ్ఎక్స్‌పై డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. విశ్వంభ‌రా సినిమా చిరంజీవి కెరీర్‌లో ఎవ్వర్ గ్రీన్ మూవీ గా ఉండబోతుందని.. ఆ రేంజ్ లో వశిష్ట సినిమాను ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఐదు పదుల వయసు దాటుతున్న ఇంకా యంగ్ హీరో లుక్స్‌తో ఆకట్టుకుంటున్న చిరంజీవి ఇలా వృధ్ధుడి పాత్రలో నటిస్తే ఫ్యాన్స్ క‌నెక్ట్ అవుతారో లేదో బేచిచూడాలి.