ప్రియుడుతో పెళ్లికి సిద్ధమవుతున్న మరో హీరోయిన్.. డెస్టినేషన్ ఎక్కడంటే

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఏడాది హిందీలో మొదలుకొని.. తెలుగు, కన్నడ, మ‌ళ‌యాళ‌ భాషల్లో చాలా మంది సెలబ్రిటీస్ ఒకటి అయ్యారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి వివాహం కూడా ఇటీవల ఘనంగా జరిగింది. ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ.. సొట్ట బుగ్గల సుందరి తాప్సి పొన్ను పెళ్లి పీటలు ఎక్కనుందంటూ వార్తలు వైరల్ అవుతాయి. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలుపెట్టి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Taapsee Pannu opens up about her decade long relationship with boyfriend  Mathias Boe: 'I'm way too happy in the relationship' | Bollywood News - The  Indian Express

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా వరుస‌ ఆఫర్లను అందుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకున్న తాప్సి.. తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి చెకేసింది. అక్కడ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం తాప్సి పొన్నుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం నెట్టింట తెగ‌ వైరల్ అవుతుంది. తాప్సీ పొన్ను, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మధియాస్ బోను ఇద్దరు ప్రేమించుకుంటున్నామంటూ ఇటీవ‌ల‌ తాప్సి వివరించింది. వీరిద్దరూ పదేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నారట.

Taapsee Pannu rings in New Year with boyfriend Mathias Boe and family

అంతకు ముందు వీరికి సంబంధించిన చిన్న వార్త కూడా బయటకి రాకుండా చాలా జాగ్రత్త పడ్డ ఈ జంట త్వరలోనే పెళ్లాడపోతున్నారని తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో సెలబ్రెటీల వెడ్డింగ్ డెస్టినేష‌న్‌గా మారిన ఉదయ్‌పూర్‌నే వేదికగా వీరి వివాహం కూడా జరగనుందని తెలుస్తుంది. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరుకానున్నరట. సినీ పరిశ్రమకు సంబంధించిన వారు ఎవరు హాజరు కారని తెలుస్తుంది. ప్రైవేట్ ఈవెంట్ గా ఈ జంట వీరి వివాహాన్ని చేసుకోనున్నారట. సిక్కు, క్రైస్తవ విధానాల్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే వారి వివాహం జరిగే వరకు వేచి చూడాల్సిందే.