నిర్చితార్థం అయి మూడు నెలలు కాకముందే విడిపోయిన జబర్దస్త్ జంట.. వైరల్ అవుతున్న పోస్ట్..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం పాటు కూడా కలిసి ఉండడం లేదు. ఇక కొందరు అయితే నిశ్చితార్థం అయినా అనంతరం కూడా విడిపోతున్నారు. ఇక తాజాగా జబర్దస్త్ నటి పవిత్ర మనందరికీ సుపరిచితమే. ఈమె కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలానే పలు షోస్ లో కనిపించడంతోపాటు యూట్యూబ్ ఛానల్ ని కూడా మేనేజ్ చేస్తూ భారీ ఎత్తుకి ఎదిగింది.

అయితే ఈమె ఇటీవలే సంతోష్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు కూడా. అదేవిధంగా పలు కార్యక్రమాలలో ఇద్దరూ కలిసి పాల్గొనడం వంటివి చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక కామెంట్స్ చేశారు. ఇక తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ని షేర్ చేసింది.

” ఇద్దరం నిర్ణయించుకున్న తరువాత వీడిపోతున్నాము. మా నిర్ణయాన్ని అర్థం చేసుకొని ఈ కష్ట సమయంలో సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. మా ఇద్దరి సపరేట్ జర్నీ బాగుండాలని విష్ చేయండి. మేము మూవ్ ఆన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీ లవ్ అండ్ సపోర్ట్ కు థాంక్స్ ” అంటూ ఓ క్యాప్షన్ ని రాసుకొచ్చింది. అదేవిధంగా ఆ పోస్ట్ కి కామెంట్స్ ఆఫ్ చేసింది. ఇక దీంతో వీరిద్దరూ విడిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.