తారక్ ” దేవర ” మూవీ రిలీజ్ పై క్లారిటీ.. ఎప్పుడంటే..!

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్ మంచి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం తారక్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ” దేవర “.

ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలమనున్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అదేవిధంగా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఇక ఈ మూవీ ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ ఆలీ ఖాన్ చేతికి గాయమైన సంగీతం తెలిసిందే. దీంతో దేవర షూటింగ్ కి బ్రేక్ పడింది. అందువల్లే దేవరా మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మార్చ్ 8న శివరాత్రి సందర్భంగా ఈ మూవీ యొక్క రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారట. ఇక మేకర్స్ అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తారు లేదో మరోసారి మార్పు చేస్తారో చూడాలి మరి.