ఎన్టీఆర్ నిక్ నేమ్ ఏంటో తెలుసా.. లక్ష్మీ ప్రణతి తారక్ ను అలానే పిలుస్తుందట..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటిన ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఎన్టీఆర్‌ని సినీ ఇండస్ట్రీలో ముద్దుగా తారక్ అని పిలుచుకుంటూ ఉంటారు.

అయితే చాలామందికి ఎన్టీఆర్ ను తన ఇంట్లో ముద్దుగా ఏమని పిలుస్తారు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఇక గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రమోషన్లు పాల్గొన్న తారక్.. తనను ఇంట్లో ఒక్కొక్క‌రు ఒక్కో పేరుతో పిలుస్తుంటారని వివరించాడు. ప్రత్యేకంగా ఓ పేరు లేదని తారక్ మాట్లాడుతూ.. మా ఇంట్లో మా అమ్మగారు ఓ పేరు పెట్టి పిలుస్తారు.. అలాగే నా భార్య లక్ష్మీ ప్రణతి ముద్దుగా ఓ పేరు పెట్టి పిలుస్తుంది.. మా పిల్లలు నాన్న‌ అని పిలుస్తారు.. అంటూ వివ‌రించాడు.

అలాగే కొంద‌రు ఎన్టీఆర్ అన్న, తారక్ అన్న, రామారావు అన్న అని పిలుస్తారు. ప్రేమగా ఎవ‌రు ఎలా పిలిచిన స్పందిస్తాను. ఇలాగే పిలవండి అని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు అంటూ వివరించాడు. అయితే లక్ష్మీ ప్రణతి ముద్దుగా ఎన్టీఆర్‌ను బావా అన్ని పిలుస్తూ ఉంటుందట. వీరిద్దరూ పెళ్లికి ముందే దూరపు చుట్టాలు కావడంతో ఆమెకు ఎన్టీఆర్ బావా బ‌రుస అవుతాడ‌ని అందుకే ఆమె తార‌క్‌ను పిలిచేటప్పుడు బావా అని పిలుస్తుందని సమాచారం.