బాలకృష్ణ‌ ఇప్పటివరకు ‘ సింహం ‘ పేరు కలిసొచ్చేలా ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించాడా.. ఆ సినిమాలు ఇవే..

నందమూరి తారక రామారావు నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో తండ్రికి తగ్గ తనయుడుగా భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు బాలయ్య. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు పూర్తయిన ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో రాణిస్తున్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలో బాలకృష్ణ అనే ముందంజలో ఉన్నాడు. వరుస‌ సినిమాల్లో నటిస్తూ ప్రతి సినిమాతో హిట్ అందుకుంటున్న న‌ట‌సింహం వరుసగా అఖండ, వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు.

ఇక చివరిగా భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ కొట్టి.. హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న ఈ నందమూరి హీరో ప్రస్తుతం యంగ్ టైగర్ బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఎటువంటి పాత్రలోనైనా ఇమ్మ‌డిపోయి నటించే బాలయ్య.. ఇప్పటివరకు సింహం పేరు కలిసి వచ్చేలా ఏకంగా తొమ్మిది సినిమాలలో నటించాడు. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. తండ్రి ఎన్టీఆర్ తో కలిసి బాలకృష్ణ నటించిన మూవీ సింహం నవ్వింది. 1983లో తెర‌కెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత సింహం పేరుతో వ‌చ్చిన సినిమాల‌లో 1994 లో తెరకెక్కిన బొబ్బిలి సింహం సినిమా ఒకటి. ఈ సినిమాలో రోజా, మీనా హీరోయిన్లుగా నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత 1999 లో వచ్చిన సమరసింహారెడ్డి కూడా ఈ సినిమాలలో ఒకటి. ఇందులో అంజలి జవేరి, సిమ్రాన్, సంఘవి కీలక పాత్రలో నటించారు. బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలాగే 2001లో నరసింహనాయుడు, 2002లో సీమ సింహం, 2004లో లక్ష్మీనరసింహ, 2010లో సింహా, 2018 లో జయసింహ, 2023లో వీరసింహారెడ్డి సినిమాలు సింహ పేరు కలిసొచ్చేలా తెరకెక్కాయి.