వామ్మో మరీ ఇంత దారుణమా.. తారక్ లాంటి స్టార్ హీరో కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నాడా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తాతకు తగ్గ మనవడిగా నట విశ్వరూపాన్ని చూపించాడు. నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఈయన.. ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. గతంలో పలుషోలకు హోస్ట్‌గా వ్యవహరించి యాంకర్ గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే గతంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తను బాడీ షేమింగ్‌ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పుడంటే ఎన్టీఆర్ స్లిమ్ లుక్ లో సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు కానీ.. రాఖీ సినిమా వరకు బాగా బొద్దుగా కనిపించాడు. యమదొంగ సినిమా సమయంలో రాజమౌళి సలహాలతో తన లుక్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్టీఆర్ అషోలో కంటెస్టెంట్‌తో మాట్లాడుతూ.. వన్ డే బ్యాచిలర్ అంటే అది పెళ్లి క్వాలిఫికేషన్ అంటూ కామెంట్లు చేశాడు. తనకు లేనిపోని థట్స్‌ ఇవ్వకండి సార్ అంటూ సమాధానం ఇచ్చాడు.

అప్పుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ మీకు సమస్య జుట్టు.. నాకు సమస్య ఫ్యాటు అంటూ వివరించారు. ఒకప్పుడు చాలా లావుగా ఉన్నానని.. అసహ్యంగా ఉన్నావని.. ఎంతోమంది విమర్శించారు అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ గతంలో ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో వివరించాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ మరోసారి వైరల్ అవ్వడంతో.. ఎన్టీఆర్ లాంటి భారీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన స్టార్ హీరోలనే ఇలా బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తే.. సాధారణ నటీనటులలో బాడీ షేమింగ్ ఎదుర్కోవడంలో పెద్ద విడ్డూరం ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.