బాలయ్య నటించిన ఆ మూవీ అసలు నచ్చలేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన అనుష్క.. అసలు ట్విస్ట్ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత నిశ్శబ్దం సినిమాలో నటించిన అనుష్క.. ఈ సినిమాతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వని స్వీటీ.. ఇటీవల యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నవీన్ పోలీశెట్టి హీరోగా తెరకెక్కిన మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకుంది.

అయితే ప్రస్తుతం కెమారాల‌కు దూరంగా ఉంటూ అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో మాత్ర‌మే నటిస్తున్న స్వీటీ.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయంలో షేర్ చేసుకుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మీరు న‌టించిన సినిమాల‌లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి అని ప్రశ్నించగా.. దానికి సమాధానం చెబుతూ నేను నటించిన సినిమాలలో నాకు అరుంధతి, వేదం సినిమాలు అంటే చాలా ఇష్టం అంటూ వివరించింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించిన ఈ ముద్దుగుమ్మ మీకు నచ్చని సినిమా ఏంటి అని ప్రశ్నించగా బాలయ్య తో కలిసి నటించిన ఒక్కమగాడు సినిమా తనకు ఏమాత్రం నచ్చదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం అనుష్క చేసిన ఈ కామెంట్ సంచలనంగా మారాయి. బాలయ్యతో సినిమా చేయడమే అదృష్టం. అలాంటిది ఆ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదంటే అనుష్క నిర్మామాటంగా చెప్పేసింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ అనుష్క పై ఫైర్ అవుతున్నారు. మరి కొంతమంది మాత్రం బాలయ్య సినిమా కాబట్టి ఆ సినిమా నచ్చలేదని చెప్పలేదు.. తను నటించిన సినిమాలలో ఆ సినిమా ఇష్టం లేదని చెప్పింది.. అందులో తప్పేముంది అంటూ అనుష్కకు సపోర్ట్ చేస్తున్నారు.