షాకింగ్‌ ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా కనిపించే కే.రాఘవేంద్రరావు.. ఆ స్టార్ హీరో పై కోపంతో కళ్ళ‌ద్దాలను నేలకేసి కొట్టాడా..

టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎవరైనా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒక డైరెక్టర్ అయిన నటుడైన తన సినిమా కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలా ఓసారి స్టార్డం వచ్చిన తర్వాత ఆ స్టార్టం నిలబెట్టుకోవాలన్నా కూడా అహ‌ర్నిశ‌లు శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో తెలుగు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకుని.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కే. రాఘవేంద్రరావు కూడా చిన్న సినిమాలు తీస్తూనే ద‌ర్శ‌కేంద్రుడిగా ఎదిగాడు. డైరెక్షన్ లో తనదైన శైలిలో సినిమాలను రూపొందించి పాపులారిటీ దక్కించుకున్న ఈయన ఒకప్పుడు వరుస సినిమాలను రూపొందిస్తూ దూసుకుపోయాడు.

ప్రస్తుతం అడపా దడపా సినిమాలను మాత్రమే దర్శకత్వం వహిస్తున్న కే. రాఘవేంద్రరావు స్టార్ హీరో వెంకటేష్ పై ఓ సందర్భంలో బాగా ఫైర్ అయ్యాడని.. అతనిపై కోపంతో కళ్లద్దాలు నేలకేసి కొట్టాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అంత కోపం ఎందుకు వచ్చింది..? అసలు ఆ కోపానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. వెంకటేష్ కెరీర్ స్టార్టింగ్ లో న‌టించిన‌ మొదటి సినిమా కలియుగ పాండవులు. ఈ సినిమాకు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ టైంలో ఒక సీన్ చేసేటప్పుడు ఆయన సరిగా నటించలేదని.. ఒకటికి పది సార్లు చెప్పిన మళ్లీ అదే దోవలో వెళ్లడంతో వెంకటేష్ పై కోపం తెచ్చుకున్న రాఘవేంద్రరావు సెట్లో అందరి ముందే ఆయనను అరిచి కళ్ళ‌ద్దాలు నేలకేసి కొట్టాడు అంటూ వార్తలు వినిపించాయి. దాంతో సెట్‌లో ఉన్న వారంతా ఒక పూట వరకు ఎటువంటి పని మొదలు పెట్టకుండా ఆపేసారట.

ఈ విషయాన్ని తెలుసుకొని సెట్స్ కు వచ్చిన రామానాయుడు.. రాఘవేంద్రరావు తో మాట్లాడి అతని కూల్ చేసి మళ్లీ షూట్ కు పంపించారట. ఇక ఈ సినిమాతో వెంకటేష్ ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాదు రాఘవేంద్ర ఏ సీన్ కోసమైతే వెంకటేష్ ను అరిచాడో.. ఆ సీన్‌లో వెంకటేష్ యాక్టింగ్ సినిమాకి హైలెట్గా నిలిచిందని చెప్తూ ఉంటారు. ఇక‌ రాఘవేంద్ర రావు అలా ఫైర్ అయినందుకు వెంకటేష్ కొంతకాలం బాధపడిన.. ఆ తర్వాత సినిమా రిలీజై ఆ సీన్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యాడట. అప్పటినుంచి నటనపరంగా అందరికంటే ముందు స్థానాల్లో ఉండాలంటే డైరెక్టర్ చెప్పే మాటను సరిగ్గా ఫాలో అవ్వాలి అని వెంకటేష్ ఫిక్స్ అయ్యాడ‌ట. దీంతో రాఘవేంద్రరావు ఆయనపై అరిచిన కోపాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని తర్వాత కూడా ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించాడు వెంకీ మామ‌.