ఆ స్టార్ హీరోయిన్ తో నా పెళ్లి రెండుసార్లు క్యాన్సిల్ అయింది.. మెగా ప్రిన్స్ షాకింగ్ కామెంట్స్..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న కపుల్ పేరు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి. గత కొంతకాలంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ప్రస్తుతం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.

ఇక పెళ్లి అనంతరం మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో లావణ్య ప్రేక్షకులు ముందుకు రాగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో వరుణ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇక వీరి పెళ్లినాటి నుంచి నేటి వరకు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

ఇక తాజాగా వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు వరుణ్. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. తనకి లావణ్య త్రిపాటికి పెళ్లి సెట్ అవ్వయేందుకు రెండుసార్లు క్యాన్సిల్ అయిందని వెల్లడించాడు. దినంతటికీ కారణం తన షూటింగ్స్ ఏ కారణమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.