చరణ్ కి.. నాకు గొడవలు జరుగుతున్నాయి.. అసలు గుట్టును బయటపెట్టిన వరుణ్ తేజ్..!

మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ప్రిన్సెస్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వరుణ్ మంచి పాపులారిటీని దక్కించుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై వరుణ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ మూవీ మార్చ్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణ్ మాట్లాడుతూ..” చిన్నప్పుడు నాకు చరణ్ అన్నకు మధ్య గొడవలు జరిగేవి.

ఒక టైం లో చిరంజీవి గారు మరియు పవన్ కళ్యాణ్ బాబాయ్ పెప్సీ, థంబ్సప్ యాడ్ చేసేవారు. ఇద్దరికీ పోటాపోటీగా వచ్చేవి. ఆ సమయంలో నేను చిరంజీవి గారి సైడ్ ఉండేవాడిని. చరణ్ ఏమో పవన్ కళ్యాణ్ బాబాయ్ సైడ్ ఉండేవాడు. అలా మా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి ” అంటూ వెల్లడించాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.