మీ పిల్లలు పాప్‌కార్న్ ను ఇష్టంగా తింటున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి..

కొంతమంది పాప్‌కార్న్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కడకు వెళ్లిన ఇదే స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది పిల్లలు కూడా పాప్‌కార్న్ ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే పాప్‌కార్న్ ఎక్కువగా తినే అలవాటును మానుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. పాప్‌కార్న్ తినే అలవాటు తో చాలా సమస్యలు తలెత్తుతాయట. పాప్‌కార్న్ ఎక్కువగా తినడం వల్ల ఊపిరితిత్తులకు తీవ్రమైన హాని కలుగుతుందని తెలుస్తోంది. పాప్‌కార్న్ ఎక్కువగా తినడం వల్ల బ్రాంకియోలిటిస్ ఆబ్లిటెరాన్స్ అనే ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుందని తెలుస్తుంది.

ఈ సమస్య తలెత్తినప్పుడు ఊపిరితిత్తుల మచ్చలు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు తలెత్తుతాయట. మైక్రోవేవ్ పాప్‌కార్న్ లో డైసిటైల్ అనే రసాయనం ఉండడంతో ఇవి రుచికి మరింత కృత్రిమ బటరీ రుచిని అందిస్తాయి. ఈ డైసిటైల్ చాలా హాని కలిగిస్తోందని తెలుస్తుంది. ఈ రసాయనం సురక్షితమైనది కాదని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వివరిస్తున్నా.. దీని వాడకం ఏమాత్రం తగ్గడం లేదు.

ఎక్కువ పరిణామం లో ఈ రసాయనాన్ని పీల్చుకుంటే చాలా ప్రమాదం కలుగుతుందట. డైసిటైల్ రుచిగల కాఫీ, ప్యాక్ చేసిన జ్యూస్లు, పంచదార పాకం, కొన్ని పాల ఉత్పత్తుల్లో కూడా ఇది ఎక్కువగా కలుస్తుందని తెలుస్తుంది. ఇక ఈ పాప్‌కార్న్ ఊపిరితిత్తుల లోని అతి చిన్న శ్వాసనాల వాపు సమస్యకు కూడా దారితీస్తుందట. క‌నుక సిల్ల‌లు పూర్తిగా పాప్‌కార్న్ తినే అల‌వాటు మానేస్తే మరింత మంచిది.