రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సూపర్ ఆపర్చునిటీ ఇచ్చిన బుచ్చిబాబు.. వీడియో వైరల్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్టైన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా బుచ్చిబాబు చరణ్ అభిమానులకి సూపర్ ఆపర్చునిటీ అందించాడు. ఈ సినిమా కోసం చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ గ్యాప్ వరకు ఉన్న వారిని ఈ సినిమాలో తీసుకుంటున్నట్లు ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేశాడు బుచ్చిబాబు. యాక్టింగ్ వచ్చిన వారైనా రానివారైనా ఈ సినిమాలో తీసుకుంటామని వెల్లడించాడు.

రియలిస్టిక్ గా తీసుకునేందుకు విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం పక్కన ఉన్న గ్రామాల నుంచి ఈ ఆడిషన్స్ కి చేరుకోమని ఓ వీడియో ద్వారా వెల్లడించాడు బుచ్చిబాబు. ఇక ఈ విలేజ్లోనే కొంతకాలం పాటు షూటింగ్ జరుగుతుందని వెల్లడించాడు. ఇక‌ ప్రస్తుతం ఈ వీడియోని చూసిన చరణ్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమాలో నటించేందుకు గాను తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.