తలకు నూనె పెట్టేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అయ్యి పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో తమ హెయిర్ కి ఆయిల్ పెడుతూ ఉంటారు. మీ జుట్టు రకాన్ని బట్టి నూనెను ఎంచుకోవడం మంచిది. లోతు నుంచి కండిషన్ చేయడం కోసం కొబ్బరినూనె మరియు పొడిబారిన జుట్టు కోసం ఆర్గాన్ ఆయిల్ ని వాడడం మంచిది.

మీ జుట్టు బట్టి ఆయిల్ ఎంచుకోండి. ఇక సాధారణంగా ప్రతి ఒక్కరు ఆయిల్ ని నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆయిల్ ని పెట్టేటప్పుడు కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా మీ హెయిర్ గ్లోయిగా పెరుగుతుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా నూనెని కొంచెం హీట్ చేసి రాసుకోవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.

అదేవిధంగా ఆయిల్ పెట్టిన తరువాత మసాజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మీ బ్రెయిన్ రిలీఫ్ ని ఫీల్ అవుతుంది. అదేవిధంగా ఆయిల్ పైన కుదుళ్ల నుంచి కింద ఎండింగ్ వరకు ఎక్కువగా అప్లై చేయాలి. మీ తల‌కి మీరు ఆయిల్ పెట్టుకునే దానికంటే ఎవరైనా మీకు పెట్టడం ద్వారా మీకు రిలీఫ్ కలుగుతుంది. మీరు ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఈ మూడు టిప్స్ ని కనుక ఫాలో అయితే పొడవైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు. అందువల్ల ప్రతిరోజు ఈ టిప్స్ ని ఫాలో అయ్యి మీరు నూనె ని మీ హెయిర్ కి అప్లై చేసుకోండి.