తులసి మొక్కని రక్షించలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్ ని ఉపయోగించండి..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో తులసి మొక్కలను వేసినప్పటికీ అవి ఎక్కువ కాలం బ్రతకడం లేదు. తద్వారా అనేక మొక్కలను వేద్దామనుకున్నా అవి ఎక్కడ చనిపోతాయో అని కంగారుపడి వెనక్కి అడుగు వేస్తున్నారు. ఇక కొన్ని టిప్స్ ని పాటించడం ద్వారా ఒక తులసి మొక్కే కాదు ఏ మొక్క అయినా బ్రతుకుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పోషకాలు కలిగిన మట్టిలో తులసి మొక్కను నాటాలి. అదేవిధంగా క్రమం తప్పకుండా తులసి చెట్టుకు నీరు పోయాలి. ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా తేమశాతం మధ్యస్తం నుంచి ఎక్కువ స్థాయిలో ఉండాలి. ఈ చెట్టు ఇంట్లో మరియు బయట వాతావరణం లో పెరుగుతుంది. కనుక దీన్ని ఎండ తగిలే ప్రాంతంలో పెట్టాలి.

వారానికి ఒకసారైనా ఎండిపోయిన మొక్క భాగాలను కత్తిరించాలి. ఇలా కనుక మీరు తులసి మొక్కను శృతి చేయడం ద్వారా ఆ తులసి మొక్క ఎన్నడు వాడిపోదు. ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయ్యి అందమైన తులసి మొక్కను మీ సొంతం చేసుకోండి.