సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకు పేర్లు ముందు కొత్త కొత్త ట్యాగ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అభిమానులు మరికొన్నిసార్లు జనాలు మరికొన్నిసార్లు డైరెక్టర్లు ఇంకొన్నిసార్లు వాళ్లే పెట్టుకుంటూ ఉంటారు . అయితే చిరంజీవికి జనాలు మెగాస్టార్ అంటూ ఎలా ట్యాగ్ ఇచ్చారో.. బాలయ్యకు నందమూరి నటసిం హం అంటూ ఎలా ట్యాగ్ ఇచ్చారో.. వెంకటేష్ కి విక్టరీ అంటూ ఎలా ట్యాగ్ ఇచ్చారో ..
అదే విధంగా విజయ్ దేవరకొండకు రౌడీ హీరో అంటూ అభిమానులు ముద్దుగా ఒక ట్యాగ్ ఇచ్చారు . దానికి కారణం ఆయన ఆటిట్యూడ్ . అర్జున్ రెడ్డి సినిమాతోనే ఆయనకు ఈ ట్యాగ్ వచ్చింది . రౌడీ హీరో అంటూ అభిమానులు ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . అయితే నిజానికి ఈ ట్యాగ్ ముందుగానే ఒక హీరో కోసం అనుకున్నారట ఫ్యాన్స్.. ఆయన మరెవరో కాదు అల్లు అర్జున్ .
అల్లు అర్జున్ కూడా అదే విధంగా ఆటిట్యూడ్ అదే విధంగా ఎనర్జిటిక్ గా ఉండడంతో ఫస్ట్ ఈ ట్యాగ్ ని అల్లు అర్జున్ కి అనుకున్నారట . అయితే చాలామంది ఈ ట్యాగ్ కన్నా అల్లు అర్జున్కి స్టైలిష్ స్టార్ అనేది బాగుంటుంది అంటూ స్టైలిష్ స్టార్ గా ట్యాగ్ చేశారట . ఆ తర్వాత ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్ . ఆ తర్వాత అదే పోలికలతో అదే హై లెవెల్ పర్ఫామెన్స్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండకు ఆ ట్యాగ్ ఇచ్చేసారు. దీనంతటికీ కారణం అర్జున్ రెడ్డి సినిమా అని చెప్పక తప్పదు . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!