ఆ సినిమాలో బాలయ్య నటించి ఉంటే బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసేవాడు.. జస్ట్ మిస్..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కథలను కొందరి హీరోల కోసం రాసుకుంటాం. టైం బాగుంటే ఆ హీరో ఆ పాత్రలో నటిస్తాడు.. ఒకవేళ టైం బ్యాడ్ అయితే నటించడు . అయితే రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో నందమూరి బాలయ్య కు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ ఎలక్షన్స్ మూమెంట్లో బిజీ బిజీగా ఉన్నారు . త్వరలోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూట్ లో పాల్గొనబోతున్నారు .

ఇలాంటి క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. బాలయ్య కూడా తన కెరియర్ లో కొన్ని కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నాడు . అయితే ఆ సినిమాలు ఆయనకు బాగుంటాయి అని తెలిసినా కూడా తనకంటే మరొక హీరోకి బాగుంటాయి అంటూ స్వయాన హీరో పేరుని సజెస్ట్ చేస్తాడు బాలయ్య . అదే లిస్టులోకి వస్తుంది భీమ్లా నాయక్ . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన వనఫ్ ద బిగ్ సినిమా భీమ్లా నాయక్ .

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేశాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో ఈ పాత్ర కోసం ముందుగా బాలయ్యను అనుకున్నారట మేకర్స్ . ఆయనకు కథ కూడా వివరించారట . స్టోరీ విన్న బాలయ్య ఈ పాత్ర నాకు బాగుంటుంది కానీ పవన్ కళ్యాణ్ కి ఇంకా బాగుంటుంది అంటూ స్వయాన పవన్ కళ్యాణ్ పేరును సజెస్ట్ చేశారట . ఈ విషయాన్ని స్వయానా బాలయ్య నే చెప్పుకోరావడం గమనార్హం. అలా పవన్ కళ్యాణ్ ఖాతాలో భీమ్లా నాయక్ హిట్టు పడింది . ఒకవేళ ఆ పాత్రలో బాలయ్య కనిపించి ఉండుంటే నా కెవ్వు కేకే అంటున్నారు అభిమానులు..!!