ప్రభాస్ కి అది అంటే అంత పిచ్చా ..? వామ్మో .. ఏంటి డార్లింగ్ ఇది..!

ప్రభాస్ ..పాన్ ఇండియా స్టార్ .. రెబల్ స్టార్ ఆరడుగుల అందగాడు.. డార్లింగ్ చాలా మొహమాటస్తుడు.. సిగ్గుపడిపోతూ ఉంటాడు.. ఏ విషయాన్ని ఓపెన్ గా చెప్పాడు . ఒకటా రెండా డార్లింగ్ గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే టైం అసలు తెలియదు ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్ళిపోతున్న రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమాతో బాక్సాఫీస్ చరిత్రను తిరగరాయిబోయే హిట్టును తన ఖాతాలో వేసుకోబోతున్నాడు .

రీసెంట్ గా డార్లింగ్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది . బడాబడా ప్రాజెక్ట్స్ లో భాగమై ఉన్న ప్రభాస్ ఫ్రెండ్షిప్ కోసం పలు సినిమాలలో గెస్ట్ పాత్రలో కూడా నటించడానికి ఓకే చేస్తున్నారట . మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా కోసం వారం రోజుల కాల్ షీట్స్ కూడా కేటాయించారట . అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట .

ఫ్రెండ్షిప్ బేస్ చేసుకొని ఫ్రీగా ఈ సినిమాను చేసి పెడుతున్నాడట . ప్రభాస్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఏడు రోజులకి కనీసం 25 కోట్లు ఛార్జ్ చేయొచ్చు . కానీ మంచు విష్ణు .. మంచు మోహన్ బాబు కోసం ఫ్రీగా ఈ సినిమాని చేసి పెడుతున్నాడట ప్రభాస్ . ప్రభాస్ కి ఫ్రెండ్షిప్ అంటే ఇంత పిచ్చా అంటూ డార్లింగ్ అభిమానులు షాక్ అయిపోతున్నారు. మొదటి నుంచి ప్రభాస్ ఫ్రెండ్ షిప్ కి ఎలాంటి వాల్యూ ఇస్తాడో మనకు తెలిసిందే..!!