బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ బాజ్ పాయ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్, జెనీలియా హీరో హీరోయిన్ల గా నటించిన హ్యాపీ సినిమాల్లో పవర్ఫుల్ పోలీస్ మ్యాన్‌గా కనిపించి మంచి పాపులారిటీ దక్కించుకున్న మనోజ్ తర్వాత టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న మనోజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి మరణానికి సంబంధించి షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. తన తండ్రి మంచం మీద చివరి స్టేజ్ లో ఉన్న టైంలో.. ఆయన అవస్థ చూడలేక బ్రతికుండగానే చనిపోవాలని కోరుకున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
నా లైఫ్ లో అత్యంత విషాదకరమైన సంఘటన నాన్న మరణం అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. ఒకరోజు నా సిస్టర్ నాన్న జీవితం ఇంకా పూర్తయిపోయిందంటూ చెప్పిందని.. డాక్టర్లు మాత్రం ఆయన ఇంకా ఈ ప్రపంచంలోనే ఇరుక్కుపోయాడంటూ వివరించారని చెప్పుకొచ్చాడు. నాకు, నాన్నకు మధ్య మంచి బాండింగ్ ఉండేదని.. మనోజ్ వివరించాడు. నాన్నకి నాకు మధ్యన ఉండే బాండింగ్ కారణంగానే నాన్నని నేనే విముక్తుడిని చేయాలంటూ చెప్పారని.. ఆయన పేర్కొన్నాడు. ఆ టైంలో నేను కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ సెట్స్ లో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. నా వ్యాన్ లో ఒక బాయ్ ముందే నాన్నతో ఫోన్ కాల్ మాట్లాడాడని.. నాన్న నువ్వు నొప్పి భరించింది చాలు.. ప్లీజ్ వెళ్ళిపో అని అన్నానని.. మనోజ్ చెప్పుకొచ్చాడు.
అందరిని వదిలి వెళ్ళిపోయే సమయం వచ్చేసిందని చెప్పానని ఆయన వివరించాడు. అలా మాట్లాడినందుకు నా మనసు చాలా కృంగిపోయింది. అది నాకు మాత్రమే తెలుసు అంటూ వివరించిన మనోజ్.. నా మాటలు విని బాయ్ ఎంతో ఏడ్చేసాడని.. ఆరోజు ఎంత కష్టంగా గడిచిందో నాకు మాత్రమే తెలుసు అని మనోజ్ వివరించాడు. నేను అలా మాట్లాడిన తర్వాత రోజే నాన్న చనిపోయారని.. ఆయన పేర్కొన్నాడు. నాన్న నన్ను చూడాలని తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోలేదని చెప్పుకొచ్చాడు. ఆయన చనిపోయాడని వార్త వినగానే కన్నీళ్లు ఆగలేదంటే చెప్పిన మనోజ్.. ఆయన చనిపోయిన తర్వాత ఏడాదిలోనే అమ్మ కూడా చనిపోయిందంటూ వివరించాడు. ప్రస్తుతం మనోజ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.