1999లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిష కృష్ణ.. 2002లో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించింది. తన 22 ఏళ్ల సినీ కెరీర్‌లో స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ మధ్యలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మళ్ళీ రీ ఎంట్రీతో అదరగొడుతుంది. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాంటిది త్రిషా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొనసాగుతుందంటే ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ వరుస విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తమిళ్‌లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నా.. తెలుగు డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ముఖ్యంగా త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భాషతో సంబంధం లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇప్పటికే తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. అటు హిందీ, మలయాళం లోను ఆఫర్‌లు అందుకుంటుంది. 40 ఏళ్ళ వయసులోనూ త్రిష అన్ని ఇండస్ట్రీల నుంచి అవకాశాలు అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ రేంజ్ లో అవకాశాలు దక్కించుకోవడం ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపరుస్తుంది.
ప్రస్తుతం మలయాళం లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్చిన ఈ ముద్దుగుమ్మ.. రామ్ అనే సినిమాలో సీనియర్ స్టార్ హీరో మోహన్‌లాల్ సరసన నటించనుంది. నిజానికి చాలా ఏళ్ళ క్రితమే త్రిష మలయాళం లో నివీన్ పౌలీలో కలిసి హే జుడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు అక్కడ పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఇప్పుడు మలయాళం లో మోహన్ లాల్ మూవీతో పాటు.. ఐడెంటిటీ సినిమా తోను మంచి హిట్ అందుకున్నే ప్రయత్నాలు చేస్తుంది. ఈ సినిమాలు సక్సస్ అయితే త్రిషకి మలయాళం లో కూడా మరిన్ని ఆఫర్స్ వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా అన్ని భాషల్లో సినిమాలు నటిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని తెగ ప్రయత్నిస్తుంది త్రిష.