రష్మిక మందనను గన్ తో బెదిరించిన టాలీవుడ్ స్టార్ హీరో.. కారణం ఏంటంటే..?!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటు స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే నేషనల్ క్రష్ గా క్రేజ్‌ సంపాదించుకుంది. అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కిన పుష్పా సినిమాలో శ్రీవల్లిగా నటించిన పాపులర్ అయింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్ భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యానిమల్ సినిమాతో దక్షిణాదిలోను మంచి క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఈమెకు బాలీవుడ్‌లోను వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి అని తెలుస్తుంది.

Devadas (2018)

అయితే ప్రస్తుతం సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. అది కూడా స్టార్ హీరోల సరసన నటిస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఓ స్టార్ హీరో రష్మిక మందనాను ఏకంగా గణిత బెదిరించాడంటూ.. ఆమె ఒణికిపోయిందంటూ వార్త నెటింట‌ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. రష్మిక మందన‌ని గన్‌తో బెదిరించడానికి కారణమేంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని రష్మిక తో కలిసి ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి దేవదాస్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో నాగార్జున కూడా ప్రధాన పాత్రలో మెప్పించాడు. అయితే మంచి లక్షణాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాప‌డింది.

Devadas (2018)

ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక అప్పట్లో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని, రష్మిక, ఆకాంక్ష సింగ్, నాగార్జున కలిసి ఇంటర్వ్యూలో సందడి చేశారు. కాగా ఆ ఇంటర్వ్యూలో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. నాని, రష్మికను మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అని ప్రశ్నించగా.. నాగార్జున కూడా రష్మికను ఇదే ప్రశ్న అడిగాడు.. విజయ్ దేవరకొండ, నాగశౌర్య, నాని ఈ ముగ్గురిలో ఎవరు నీ ఫేవరెట్ అని నాగ్ అడిగాడు.. దానికి రష్మిక తడబడుతుండడంతో నాని అక్కడే టేబుల్ పై ఉన్న గన్‌తో ఆమెను బెదిరించాడు. దీంతో రష్మిక నాని పేరు చెప్పేసి ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.