పూరి జగన్నాథ్ కే చుక్కలు చూపించిన వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరోయిన్ ఈమె.. ఎంతలా టార్చర్ చేసిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ప్రజెంట్ సిచువేషన్ ఎంత వరస్ట్ గా ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఒకప్పుడు ఎంతోమంది హీరోస్ ని స్టార్స్ గా మార్చిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక్క హీరోతో కూడా హిట్ అందుకోలేకపోతున్నాడు.. అసలు ఆ హీరోలు అవకాశమే ఇవ్వలేకపోతున్నారు.. దానికి కారణం పూరీ జగన్నాథ్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లు అందుకోవడమే .

మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఆయన హిట్ ఇచ్చిన హీరోలు కూడా ఇప్పుడు ఆయన నమ్మడం లేదు .. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . ప్రెసెంట్ డబుల్ ఇస్మార్ట్ షూట్లో బిజీగా ఉన్న పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఒక హీరోయిన్ పూరి జగన్నాథ్ ను బాగా టార్చర్ పెట్టిందట. జనరల్ గా హీరోయిన్స్ ని పూరి జగన్నాథ్ టార్చర్ చేస్తూ ఉంటాడు . అడిగిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అంతవరకు టేకుల మీద టేకులు తీసుకుంటూనే ఉంటాడు ..పూరి అన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది . అయితే ఒక హీరోయిన్ మాత్రం పూరి జగన్నాథ్ ని టార్చర్ పెట్టిందట . ఆ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఆమె మరెవరో కాదు అనుష్క శెట్టి .

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయిన అనుష్క ..పూరి జగన్నాథ్ ను బాగా టార్చర్ చేసిందట. గతంలో ఎప్పుడైనా అనుష్క ఫోటో షూట్ చేసిందేమోనని పూరి జగన్నాథ్ ..ఫొటోస్ ఉన్నాయా అని ఆమెను అడిగారట ..అనుష్క వెంటనే తన బ్యాగ్ లో చేయి పెట్టి ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసిందట . దెబ్బకి పూరి జగన్నాథ్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయట . అదేంటి నేనేం తప్పు చేశాను అని అనుష్క అలా ఉండిపోయిందట. ఫోటో అడిగాడు ఇచ్చాను అంటూ అనుష్క తన మనసులోనే అనుకున్నిందట.

ఇప్పుడు ఈ ఫోటో తీసుకెళ్లి నేను నాగార్జునకు చూపించాలా అని పూరి జగన్నాథ్ కూడా మనసులో నవ్వుకున్నారట. అంతేకాదు ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు అనుష్క పై అరిచినా కూడా అనుష్క వెంటనే ఘాటుగా కౌంటర్స్ వేస్తూ నవ్వేస్తుందట.. చాలా చాలా సీన్స్ లో పూరి జగన్నాథ్ చెప్పిన ఎక్స్ప్రెషన్స్ కన్నా తను ఓన్ గానే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇదే బాగుంటుంది ఇదే బాగుంటుంది అంటూ ఆ సీన్స్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఫైనలైజ్ చేసేదట . అంత కన్విన్సింగ్ మైండ్ అనుష్కకి ఉంది అని పూరి జగన్నాథ్ ఆమెను ఓ రేంజ్ లో పొగిడేసారు..!!