ఈ ఎన్నికల్లో శ్రీ రెడ్డి ఎవరికి ఓటు వేసిందో తెలుసా..? గెలిచేది ఆ పార్టీ నేనా..?

శ్రీ రెడ్డి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉంది అని లేవనెత్తింది శ్రీ రెడ్డినే.. అవకాశాల కోసం అమ్మాయిలను వాడుకొని వదిలేస్తున్నారు అంటూ శ్రీరెడ్డి ఎంతలా ఉద్యమం చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత పలు కాంట్రవర్షియల్ వీడియోలతో సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ అయింది ..ట్రోలింగ్కి గురైంది . కాగా ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి ఎక్కడ కూడా కనిపించలేదు. తన పని తాను చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.

దైవస్మరణలో మునిగిపోయింది . దీంతో చాలామంది శ్రీ రెడ్డి ఫ్యాన్స్ ఆమెను పొగిడేసారు. నువ్వు ఇలా ఉండడమే బాగుంది అక్క ..నువ్వు అందరికీ ఇన్స్పిరేషన్ అక్క అంటూ శ్రీరెడ్డిని ఓ రేంజ్ లో ప్రశంసించారు .తాజాగా శ్రీ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకుంది . ఈ క్రమంలోని ఓటు వేసిన తర్వాత సిరా గుర్తుని చూపిస్తూ తాను ఎవరికి ఓటు వేశాను అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది .

“ఎవడ్రా మనల్ని ఆపేది ..? నేను జగన్ కి ఓటు వేసేసా”.. అంటూ పోస్ట్ చేసింది . అయితే మొదటి నుంచి శ్రీరెడ్డి జగన్ కి సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫైనల్లీ అన్న మాట ప్రకారమే జగన్ కి ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించుకునింది .కాగా సోషల్ మీడియాలో మాత్రం సర్వేలు వేరే విధంగా చెబుతున్నాయి . ఈసారి అధికారం చేపట్టబోయేది టిడిపి – జనసేన – బిజెపి కూటమి అంటూ ఇప్పటికే పలు సర్వేలు ఓపెన్ గా చెప్పేసాయి..!!