మళ్లీ అదే తప్పు చేసిన తారక్.. ఈసారి నందమూరి ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అయ్యారుగా..!

సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . ఇన్నాళ్లు ఏపీలో ఏ రాజకీయ పార్టీ అధికారం చేపట్టబోతుందా..? ఎవరు ఎలాంటి పథకాలతో జనాల మనసులను దోచేస్తారా ..?అంటూ చాలా చాలా విషయాలను ట్రెండ్ చేశారు జనాలు . అదేవిధంగా మీమర్స్ ట్రోలర్స్.. ఫైనల్లీ ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. మరికొద్ది రోజుల్లోనే అసలు ఏపీ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయబోతున్నారు అనే విషయం తేలిపోబోతుంది . ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా టిడిపి – బిజెపి – జనసేన కూటమి ఈసారి భారీ మెజారిటీ ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది .

అయితే ఇది ఇలా ఉండగా పోలింగ్ బూత్ వద్దకు స్టార్ సెలబ్రిటీస్ వేసుకొచ్చిన షర్ట్ కలర్స్ అదేవిధంగా వాళ్ళు బిహేవ్ చేసిన పద్ధతికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి . ఓ వ్యక్తి జనసేన పై ఉండే అభిమానంతో జనసేన పార్టీ కండువా రంగు ఎర్ర తువాల్ మెడలో వేసుకొని ఓటు వేయడానికి వచ్చారు. దాన్ని అక్కడ స్థానికులు అడ్డుకున్నారు . ఈ వీడియో వైరల్ గా మారింది . అంతేకాదు నందమూరి నట సింహం బాలకృష్ణ సైతం మెడలో పసుపు కండువా కప్పుకొని మరి ఓటేశారు .

ఆయనను ఎవ్వరు అడ్డుకోలేదు అయితే ఇదే క్రమంలో తారక్ తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో షర్ట్ వేసుకొని ఓటు వేయడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపించింది . ఇది ఓ పార్టీని ప్రమోట్ చేస్తూ చేసిన పని అంటూ బాగా ట్రోల్ చేశారు . అయితే తారక్ ఇది చాలా క్యాజువల్ గా వేసుకున్న షర్ట్ అంటూ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది . కానీ తారక్ ఈ విషయంపై కూడా ఎటువంటి విధంగా స్పందించకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు. తారక్ పెద్ద తప్పే చేస్తున్నాడు అని ఆయనపై సోషల్ మీడియాలో ఏదైనా తప్పుడు ట్రోలింగ్ జరుగుతుంటే రెస్పాండ్ అవ్వాలి అని ఫాన్స్ కోరుకుంటున్నారు..!!