ఈగ సినిమాను రాజమౌళి ఏ హీరోతో తెరకెక్కించాలి అనుకున్నాడో తెలుసా..? అస్సలు నమ్మలేరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆయన డైరెక్షన్ సూపర్ .. కెవ్వు కేక . అంతేకాదు ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తన సినిమా హిట్ అవ్వాలి అని భారీ కలెక్షన్ సాధించాలి అనే సినిమాలను తెరకెక్కిస్తారు . అయితే రాజమౌళి మాత్రం టూ డిఫరెంట్ జనాల నాడి పట్టుకొని ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తే వాళ్లకి నచ్చుతుందో అన్న కాన్సెప్ట్ తో ముందుగానే ఆలోచించి అలాంటి సినిమాలను తెరకెక్కిస్తాడు .

రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు. రాజమౌళి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఈగ . ఈ సినిమాలో హీరోగా నాని హీరోయిన్గా సమంత నటించారు . అయితే హీరో నాని క్యారెక్టర్ అరగంట కూడా ఉండదు . నిజానికి ఈ క్యారెక్టర్ కోసం నాగచైతన్యను అనుకున్నాడట రాజమౌళి . కానీ ఇంత చిన్న క్యారెక్టర్ చేస్తే కొడుకు కెరియర్ దెబ్బతింటుంది అన్న కారణంతో నాగార్జున ఈ సినిమాను ఓకే చేయనివ్వలేదట .

ఆ తర్వాత ఈ పాత్ర కోసం చాలామంది హీరోలను అప్రోచ్ అయిన ఫైనల్లి నాని సెలెక్ట్ అయ్యాడు . త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా బాలీవుడ్ జనాలను కూడా మెప్పించింది. ఒక్క ఈగ పగ తీర్చుకుంటే ఎలా ఉంటాది అనేది సినిమా కి హైలెట్ కాన్ సెప్ట్. ఈ సినిమా ఇప్పటికి టీవీలో వస్తే చూసి ఎంజాయ్ చేసే జనాలు చాలా మందే ఉన్నారు..!!