యూఎస్ మార్కెట్ లో ” సలారోడి ” లేటెస్ట్ వసూళ్లు.. ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంటూనే ఊచకోత కోసావుగా…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ మూవీ ప్రభాస్ అభిమానులని బేబచ్చంగా ఆకట్టుకుంది. ఇక ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ ని షేక్‌ చేస్తుంది. రీసెంట్ గానే 500 కోట్ల మార్కెట్ ని క్రాస్ చేసిన ఈ మూవీ ప్రస్తుతం సాలిడ్ వసూళ్లను రాబడుతుంది.

ఇక లేటెస్ట్ గా యూఎస్ లో ఈ మూవీ 7.5 మిలియన్ మార్క్ మైల్ స్టోన్ నీ టచ్ చేసి 8 మిలియన్ డాలర్స్ దిశగా దూసుకుపోతుంది. మొత్తానికి అయితే సలార్ సెన్సేషన్ ఇప్పుడు గట్టిగానే ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాణం వహించారు.