రోషన్ “బబుల్ గమ్”తో జాన్వీ కి ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఫెవికాల్ బంధమే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల తాజాగా నటించిన సినిమా “బబుల్గం”. ఈ సినిమా ద్వారానే ఆయన ఇండస్ట్రీలోకి హీరో గా ఎంట్రీ ఇచ్చారు . మొదటి సినిమాతోనే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు యువతకి అని చెప్పాలి. సినిమాలో కొరకడాలు ముద్దులు పెట్టడాలు హగ్గులు తప్పిస్తే మరి ఏమీ లేవు. సినిమా అంతా నేటి జనరేషన్ కి బాగా నచ్చే విధంగా తెరకెక్కించారు మేకర్స్.

ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ తో సంబంధం ఉంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సుమ ఫాన్స్ కూడా ఈ న్యూస్ విని ఆశ్చర్యపోతున్నారు . యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల తాజాగా బబుల్గం సినిమాలో నటించాడు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలో రోషన్ క్యారెక్టర్ పేరు ఆది .

మానస చౌదరి క్యారెక్టర్ పేరు జాన్వి. నిజానికి ఈ పాత్ర కోసం ఎన్నో పేర్లను అనుకున్నారట . కానీ రోషన్ కనకాలనే జాన్వి అనే పేరును చూస్ చేసుకున్నారట. దానికి కారణం ఆయన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ కి పిచ్చ ఫ్యాన్ కావడమే . అంతే కాదు ఈ విషయం యాంకర్ సుమకి కూడా తెలుసు . ఆయన కోరిక ప్రకారమే ఈ సినిమాలో జాన్వి అంటూ మానస చౌదరి క్యారెక్టర్ పేరుని డిజైన్ చేశారట , ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో రోషన్ కనకాల మామూలు ముదురు కాదుగా అంటున్నారు జనాలు..!!