వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన విశాల్… దెబ్బకి గుట్టు బయట పెట్టేసాడు గా…!

యంగ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయ‌న‌ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం విశాల్ న్యూయార్క్ సిటీ లో ఉన్నారు. అక్కడి వీధుల్లో ఓ అమ్మాయి తో తిరుగుతుండగా.. కొందరు వీడియో తీశారు. అది గమనించిన విశాల్ వెంటనే తన మొహాన్ని దాచుకుని అమ్మాయితో కలిసి పరుగులు తీశాడు.

ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీంతో అది చూసిన ప్రేక్షకులు ఆ అమ్మాయిని విశాల్ ప్రేమిస్తున్నాడు అంటూ రూమర్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఆ వీడియో పై హీరో విశాల్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ” సారీ, రీసెంట్గా వచ్చిన వీడియో గురించి మీకు నిజం చెప్పాలి. అందులో కొంచెం నిజం ఉంది.

నేను న్యూయార్క్ లోని ఉన్నాను. రెగ్యులర్ గా సంవత్సరం అంతా కష్టపడి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడానికి న్యూయార్క్ లో నా కజిన్స్ ఉండే ప్లేస్ కి వెళ్తాను. ఇక మిగిలిన సగం అది ప్రాంక్. నేను, నా కజిన్స్ క్రిస్మస్ రోజు సరదాగా చేసింది. నాలో ఉన్న చిన్నపిల్లాడు ఎప్పుడూ బయటకు వచ్చి ఇలా సరదాగా ఎంజాయ్ చేయడానికి ఫిక్స్ అవుతాడు. మీ డిటెక్టివ్ ఆలోచనలకు ఇక ముగింపు చెప్పండి. కొంతమంది టార్గెట్ చేసి మరి రాశారు. నేను దీన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. లవ్ యు ఆల్ ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.